‘ఆఫీసర్’ ట్రాప్ లో పడిందిలా?

గోదావరి జిల్లాలకు చెందిన ఓ చిన్న బయ్యర్. ఆఫీసర్ సినిమాను ఆంధ్ర మొత్తానికి కొనడం ఏమిటి? ఆశపడ్డాడా? ఆశపడి భంగపడ్డాడా? అసలు ఏం జరిగింది? అదే ఆరాతీస్తే.. రాజమండ్రికి చెందిన సుబ్రహ్మణ్యం అనే ఆయన…

గోదావరి జిల్లాలకు చెందిన ఓ చిన్న బయ్యర్. ఆఫీసర్ సినిమాను ఆంధ్ర మొత్తానికి కొనడం ఏమిటి? ఆశపడ్డాడా? ఆశపడి భంగపడ్డాడా? అసలు ఏం జరిగింది? అదే ఆరాతీస్తే.. రాజమండ్రికి చెందిన సుబ్రహ్మణ్యం అనే ఆయన చిన్న ప్లేయర్. ఆ జిల్లాకు చెందిన సీనియర్ బయ్యర్ నే కానీ, మరీ పెద్ద బయ్యర్ కాదు. అయితే ఆఫీసర్ ఉచ్చులో ఎలాపడ్డాడు? ఆ వైనం ఇలా వుంది.

ముందుగా ఆఫీసర్ సినిమా కోసం సదరు సుబ్రహ్మణ్యాన్ని ఫైనాన్స్ అడిగారట. ఆయనకు ఆ వ్యాపారం కూడా వుంది. సరే అని కోటి ఇరవైలక్షలో, కోటి ముఫైలక్షలో ఫైనాన్స్ చేసాడు. ఆ కాగితాలు అన్నీ వున్నాయి. తీరా సినిమా ఫినిష్ అవుతున్న టైమ్ లో ఫైనాన్స్ అమౌంట్ వెనక్కు అడిగితే వర్మ అండ్ కో మొహం చాటేసారని తెలుస్తోంది.

గట్టిగా అడిగితే ' నీదగ్గర కాగితాలు అన్నీ వున్నాయి కదా, కోర్టుకు వెళ్లు' అని కరఖండీగా చెప్పేసారట. కోర్టుకు వెళితే ఏళ్లూ, పూళ్లు పడుతుందని తెలుసు. అందుకే కనీసం తను ఇచ్చిన మొత్తానికి తనకు ఉభయ గోదావరి జిల్లాల హక్కుల ఇవ్వమని అడిగాడట. దొరికాడు బకరా అనుకుని వుంటారు. అలా విడివిడిగా అమ్మేది లేదు. తక్కువకు ఇస్తాం, మొత్తం ఆంధ్ర అంతా తీసుకో, జస్ట్ మూడున్నర కోట్లే అన్నారట.

సరే, కనీసం పెట్టుబడి అన్నా వెనక్కు రాకపోతుందా అని సదరు సుబ్రహ్మణ్యం తెగించారు. 19 లక్షలు తగ్గించి, మూడుకోట్ల 31లక్షలు కట్టారు. ఇప్పుడేమయింది.. ఉన్నది ఉంచుకున్నది పోయినట్లు అయింది. ఇదిలా వుంటే ఆర్జీవీ ఆయన మనుషులు హైదరబాద్ లో సినిమా పనయిపోయిందని, ముంబాయికి వెళ్లిపోయినట్లు వినికిడి.