చాన్నాళ్ల కిందటే ప్రకటించారు వెంకీ-త్రివిక్రమ్ సినిమాని. ఇంకా చెప్పాలంటే వెంకటేష్ బర్త్ డే సందర్భంగా హారిక-హాసిని సంస్థ ఈ విషయాన్ని ఓ పోస్టర్ ద్వారా ప్రకటించింది. ఆ తర్వాత పలు ఇంటర్వ్యూల్లో త్రివిక్రమ్ కూడా వెంకటేష్ తో సినిమా ఉంటుందని నిర్థారించాడు. అయితే ఈ ఏడాది వెంకీ-త్రివిక్రమ్ సినిమా ఉండదు.
త్రివిక్రమ్-వెంకటేశ్ సినిమాకు సంబంధించి హారిక-హాసిని సంస్థ చూచాయగా కొన్ని డేట్స్ ఫిక్స్ చేసింది. వెంకీతో పాటు సురేష్ బాబు ఒప్పుకుంటే, దాదాపు అవే తేదీలు ఖరారయ్యే అవకాశం ఉంది. లేటెస్ట్ అప్ డేట్ ఏంటంటే.. వెంకీ-త్రివిక్రమ్ సినిమాకు డిసెంబర్ 13న ముహూర్తం షాట్ అనుకుంటున్నారు.
అంటే.. ఈ ఏడాది త్రివిక్రమ్-వెంకటేశ్ సినిమా సెట్స్ పైకి రాదన్నమాట. ఇక రెగ్యులర్ షూటింగ్ ను వచ్చే ఏడాది జనవరి నుంచి స్టార్ట్ చేసి, 2019 ఆగస్ట్ లో సినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనేది నిర్మాత చినబాబు ప్లాన్. అయితే ఇందులో ఎన్ని మార్పులు జరుగుతాయో ఎవరికీ తెలీదు.
ఇప్పటికే తేజ సినిమాను పక్కనపెట్టాడు వెంకటేష్. అంతకంటే ముందు కిషోర్ తిరుమల ప్రాజెక్టు కూడా రిజెక్ట్ చేశాడు. ప్రకటించి పక్కనపెట్టినవి ఈ రెండే. ఎనౌన్స్ చేయకుండా సైడ్ చేసినవి మరో 2 ఉన్నాయి. సో.. వెంకటేష్ కు త్రివిక్రమ్ ఫుల్ నెరేషన్ ఇవ్వాలి. అది వెంకీతో పాటు సురేష్ బాబుకు నచ్చాలి. అప్పుడు సినిమాకు కొబ్బరికాయ కొడతారన్నమాట. సో.. ఈ ఏడాది కూడా వెంకటేష్ సెట్స్ పైకి రాకుండానే గడిపేస్తాడన్నమాట.