ఈ మధ్య మీడియాలో విపరీతమైన పాపులారిటీ సంపాదించిన సినిమా నటి శ్రీరెడ్డి. వివిధ కారణాలతో అటు సోషల్ మీడియాలో, ఇటు రెగ్యులర్ మీడియాలో విపరీతమైన పాపులారిటీ వచ్చింది శ్రీరెడ్డికి.
అయితే ఇప్పుడు మరింత పాపులారిటీ కోసం మా టీవీ బిగ్ బాస్ లో చోటు సంపాదించేందుకు ప్రయత్నం చేసినట్లు తెలుస్తోంది. ఈ మధ్య బిగ్ బాస్ 2 ప్రాబబుల్స్ జాబితాలో శ్రీరెడ్డి పేరు తరచు వినిపిస్తోంది.
కానీ వాస్తవానికి ఈ షోలో శ్రీరెడ్డి వుండదని తెలుస్తోంది. బిగ్ బాస్ 2లో తాను పార్టిసిపేట్ చేస్తానని శ్రీరెడ్డినే స్వయంగా ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ దీనికి మా టీవీ బిగ్ బాస్ 2 కార్యక్రమం మొత్తం రూపొందించే ప్రయివేట్ కార్పొరేట్ సంస్థ సానుకూలంగా స్పందించలేదని తెలుస్తోంది. అంటే బిగ్ బాస్ 2 హవుస్ లో శ్రీరెడ్డి కనిపించదన్నమాట.
ఈ కార్యక్రమంలో పాల్గొంటే శ్రీరెడ్డి దాదాపు కొన్ని వారాల పాటు ప్రేక్షకుల ముందు వుండి, మరింత పాపులారిటీ వస్తుంది. కానీ ఇప్పుడు అది మిస్ అయింది. ఇదిలా వుంటే హీరోయిన్ చార్మి వుంటుందని కూడా వినిపించింది. కానీ మాటీవీ టీమ్ చార్మిని కానీ, అలాగే హీరో తరుణ్ ను కానీ సంప్రదించలేదని తెలుస్తోంది. ఇప్పటికే తరుణ్ తాను బిగ్ బాస్ 2లో లేనని క్లియర్ చేసారు. చార్మి కూడా వుండదన్నది పక్కాగా తెలుస్తోంది.