అన్ డిస్ప్యూటెడ్ సూపర్ స్టార్ ఆఫ్ ఇండియా అని అందరూ చెప్పుకునే రజనీ కాంత్ హైదరాబాద్ వస్తున్నారు. తన సినిమా ప్రమోషన్లకు రజనీ హైదరాబాద్ రావడం కామన్. అయితే ఎప్పుడు వస్తాడని అభిమానులు ఎదురు చూడడం కూడా అంతకన్నా కామన్. అందుకే రజనీ రాక అన్నది ఓ వార్త.
రజనీ నటించిన కాలా సినిమా ఈవారంలో విడుదల కాబోతోంది. ఏడవ తేదీన కాలా విడుదల సందర్భంగా ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొనడానికి రజనీ ఈ సోమవారం హైదరాబాద్ వస్తున్నారు. ఆరోజు పార్క్ హయాత్ లో జరిగే కాలా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రజనీ పాల్గొనే అవకాశం వుంది.
కబాలి తరువాత మళ్లీ రజనీ సినిమా ఇదే. ఈ సినిమా మీద కాస్త మంచి అంచనాలే వున్నాయి. ఇటీవలే రాజకీయరంగ ప్రవేశం చేసిన దృష్ట్యా, ఈ సినిమాలో కాస్త పోలిటికల్ టచ్ కూడా వుండే అవకాశం వుందని తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఎన్వీ ప్రసాద్ పంపిణీ చేస్తున్నారు. వైజాగ్, నైజాంల్లో దిల్ రాజు పంపిణీకి తీసుకున్నారు.