దిల్ రాజు మనసుకు నచ్చాలే కానీ, అడ్డంగా నిలబడిపోతారు అన్నది టాలీవుడ్ టాక్. దాని వల్ల నష్టం వస్తుందా? లాభం వస్తుందా? అన్నది ఆయన ఆలోచించరు. బరిలో దూకేస్తారంతే. అయితే ఇప్పుడు అంత రిస్క్ వచ్చే పనేమీ చేయలేదు. జస్ట్ ఓ మీడియం సినిమాకు సపోర్ట్ గా నిలిచారు.
ఇంద్రగంటి మోహన కృష్ణ డైరక్షన్లో సుధీర్ బాబు నటిస్తున్న చిత్రం సమ్మోహనం. ఈసినిమా బేరం ఆయన దగ్గరకు వెళ్లినపుడు, తాను సినిమాలు కొనడం తగ్గించేసానని, కావాలంటే డిస్ట్రిబ్యూషన్ చేస్తా అని, అది కూడా నైజాం వరకే అని అన్నారు. కానీ ఆ తరువాత ట్రయిలర్ వచ్చింది.
అది చూసాక, కాస్త రష్ చూసాక దిల్ రాజు ఆ సినిమాకు అండగా నిలిచిపోయారు. వైజాగ్, నైజాం కాస్త రీజన్ బుల్ రేటుకు ( ఆ సినిమా బడ్జెట్ మేరకు) కొన్నారు. కొనడం కాదు, సీడెడ్ ఆయనే దగ్గరుండి బేరం చేయించి బయ్యర్ నరసింహ చేత కొనిపించారు. ఓవర్ సీస్ నిర్వాణ వాళ్లు ముందే తీసుకున్నారు.
దీంతో ఇక ఈస్ట్, వెస్ట్, కృష్ణ, గుంటూరు, నెల్లూరు మాత్రం మిగిలాయి. ఇప్పుడు దాని మీద కసరత్తు జరుగుతోంది. మహా మహా సినిమాలే కొనేవాళ్లు కరువైపోయారు. ఓన్ రిలీజ్ లు చేసుకుంటున్నారు అంతా. ఈ టైమ్ లో దిల్ రాజు అండగా వుండి సినిమాను అమ్మించి పెడుతుంటే ఆ నిర్మాత అదృష్టవంతుడే అనుకోవాలి.