డిపెండబుల్ హీరో నాని. అందులో సందేహంలేదు. ఏదో కృష్ణార్జున యుద్దం దెబ్బతింది కానీ, మామూలుగా అయితే నాని సినిమా 15కోట్ల వరకు మినిమమ్ గ్యారంటీ వుంది. నిర్మాతలు పోటీపడి రెమ్యూనిరేషన్ పెంచి, బడ్జెట్ ను పాతికకు తీసుకెళ్లితే ప్రమాదం తప్ప, 15కోట్ల రేంజ్ లో నానితో సినిమా అంటే కచ్చితంగా లాభాలు గ్యారంటీ. అందువల్ల నానికి నిర్మాతల సమస్యలేదు.
వచ్చిన చిక్కల్లా డైరక్టర్లతోనే. దగ్గరలో డైరక్టర్లు ఎవ్వరూ కనిపించడం లేదు. నాని కూడా కొత్తవాళ్లతో చేయడానికి చాలా స్పీడ్ గా ముందుకు వస్తాడు. అయితే సరైన సబ్జెక్ట్ పట్టుకుని వస్తున్న కొత్తవాళ్లు కూడా కనిపించడం లేదు. అందుకే ఇప్పుడు నాని అదేపనిగా కథలు వింటున్నాడట.
ప్రస్తుతం చేస్తున్న నాగ్ తో మల్టీస్టారర్ పూర్తికావస్తోంది. కొరటాల శివ సినిమా వుంటుందేమో అని వెయిట్ చేస్తే, అది డవుట్ లో పడింది. విక్రమ్ కుమార్ సినిమా అంటే అది బన్నీ దగ్గరకు వెళ్లిపోయింది. ఈ సినిమాల కోసం కాస్త గ్యాప్ ఇచ్చాడు. అందువల్ల ఇప్పుడు కథలు వినడం స్పీడప్ చేసాడట నాని. తమిళ డైరక్టర్, తెలుగు దర్శకుడు అని లేదు. ఎవరు మాంచి కథ చెబితే ఇప్పుడు వాళ్లకే చాన్స్. మరి ఎవరికి దక్కుతుందో అవకాశం చూడాలి.
ఈ సినిమా అయిన తరువాత నవంబర్ నుంచి దిల్ రాజు నిర్మాణంలో, ఓ కొత్త డైరక్టర్ తో సినిమా వుంటుంది. ఆ లోపుగా వుండే సినిమాకే కథ, దర్శకుడు కావాలి.