ఇది నిజమేనా: నాని షోలో శ్రీరెడ్డి ఉంటుందా..?

“తెర మీదకు వచ్చేసరికి ఒక్కొక్కడు శ్రీరంగ నీతులు చెప్తారు, మన నేచురల్ స్టార్ నాని ఒక అమ్మాయికి ఒక రోజంతా నరకం చూపించాడు, కాస్కోరా నాని నీ టోకెన్ వచ్చింది, నీకు ఫ్యామిలీ ఉందిగా,…

“తెర మీదకు వచ్చేసరికి ఒక్కొక్కడు శ్రీరంగ నీతులు చెప్తారు, మన నేచురల్ స్టార్ నాని ఒక అమ్మాయికి ఒక రోజంతా నరకం చూపించాడు, కాస్కోరా నాని నీ టోకెన్ వచ్చింది, నీకు ఫ్యామిలీ ఉందిగా, కొంచెం కూడా సిగ్గులేదా అలా చేయటానికి ఛీ”

కొన్ని రోజుల కిందట హీరో నానిపై శ్రీరెడ్డి స్వయంగా పెట్టిన పోస్ట్ ఇది. కట్ చేస్తే ఇప్పుడు బిగ్ బాస్ సీజన్-2కు వ్యాఖ్యాతగా నాని రాబోతున్నాడు. అదే రియాలిటీ షోలో శ్రీరెడ్డి కూడా పాల్గొనే అవకాశం ఉందంటూ వార్తలు వస్తున్నాయి. మరి శ్రీరెడ్డిని పార్టిసిపెంట్ గా నాని ఒప్పుకుంటాడా? నాని ఉన్నాడని తెలిసి మరీ శ్రీరెడ్డి ఒప్పుకుందా..?

చాలామంది ప్రముఖులపై శ్రీరెడ్డి విమర్శలు చేసినప్పటికీ ఎక్కడా డైరక్ట్ అవ్వలేదు. అన్నీ ఇండైరెక్ట్ పోస్టులే. ఒక్క నాని విషయంలోనే ఆమె ఇలా ఓపెన్ గా విరుచుకుపడింది. అయితే దీనిపై ఇప్పటివరకు నాని రియాక్ట్ అవ్వలేదు. చూసీచూడనట్టు వదిలేశాడు. ఇలాంటి ఇద్దరు వ్యక్తులు బిగ్ బాస్ వేదికపై కలిస్తే పరిస్థితేంటనేది ఆసక్తికరంగా మారింది.

శ్రీరెడ్డి ఎంట్రీపై స్టార్ మా యాజమాన్యం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. సీజన్-1తో పోలిస్తే బిగ్ బాస్ సీజన్-2లో కంటెస్టెంట్లు ఎక్కువ మంది. వాళ్లలో సగానికి పైగా ప్రముఖుల్ని ఇప్పటికే ఎంపిక చేశారు. అందులో శ్రీరెడ్డి పేరు కూడా ఉందని టాక్.

మరోవైపు బిగ్ బాస్ సీజన్-2లో తను పాల్గొనడం లేదని క్లారిటీ ఇచ్చాడు తరుణ్. మొన్నటివరకు లిస్ట్ లో ఇతడి పేరే ప్రముఖంగా వినిపించింది. కానీ తరుణ్ మాత్రం తనకు ఇంట్రెస్ట్ లేదని తేల్చిచెప్పేశాడు. తేజశ్వి, గీతామాధురి దాదాపు ఓకే చెప్పేసినట్టే. ఇక శ్రీరెడ్డి సంగతే తేలాల్సి ఉంది. నాని ఒప్పుకుంటేనే శ్రీరెడ్డి ఉంటుంది. నో అంటే మాత్రం ఆమెకు ఛాన్స్ లేనట్టే.