ఆడ మగగా, మగ ఆడగా అంటే లక్షణాలు అటు ఇటు మారే పాయింట్ తో ఎవర్ గ్రీన్ కామెడీ సినిమా 'జంబలకడి పంబ' తీసి అందించాడు దర్శకుడు ఈవీవీ అప్పట్లో. ఇప్పుడు అదే టైటిల్ తో కమెడియన్ కమ్ హీరో శ్రీనివాసరెడ్డి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాలో కూడా మధ్యలో నుంచి ఇదే టైపు ఫిక్షన్ పాయింట్ స్టార్ట్ అవుతుందట.
ప్రేమించి పెళ్లి చేసుకుని, గొడవలు వచ్చి, విడిపోదాం అనుకునే టైమ్ లో చిన్న ఫిక్షన్ పాయింట్ తో హీరో హీరోయిన్ల లక్షణాలు మారిపోవడం అన్నది కీలకపాయింట్ గా తెలుస్తోంది. దీంతో మగవాడి కష్టాలు, ఆడవారికి, ఆడవారి కష్టాలు మగవారికి తెలిసిరావడం, అందులోంచి పుట్టే కామెడీ కథాంశంగా తెలుస్తోంది.
ఇదే టైమ్ లో విడాకులకు అనుకూలంగా, వ్యతిరేకంగా సమాజంలో వినిపించే రెండు వాదనలకు రిప్రెజెంటేటివ్ లుగా పోసాని, పృధ్వీ కనిపిస్తారట. సినిమాలో వీరి ఫన్నీ ఆర్గ్యుమెంట్లు, శ్రీనివాసరెడ్డి ఆడలక్షణాలతో పండించే నవ్వులు కీలకం అని తెలుస్తోంది.
మొత్తంమీద అలనాటి సూపర్ కామెడీని మరోసారి మరో విధంగా ప్రెజెంట్ చేయడం కాస్త ఆసక్తి కరమే.