సవ్యసాచి ఇంకో మూడు వారాలు

హీరో నాగచైతన్య ప్లానింగ్ ఎక్కడో తేడా కొట్టినట్లుంది. ఒక సినిమా తరువాత మరో సినిమా చేయడం మాని, కొన్ని రోజులు ఓ సినిమాకు మరి కొన్ని రోజులు ఇంకో సినిమాకు కేటాయిస్తూ, రెండు సినిమాలు…

హీరో నాగచైతన్య ప్లానింగ్ ఎక్కడో తేడా కొట్టినట్లుంది. ఒక సినిమా తరువాత మరో సినిమా చేయడం మాని, కొన్ని రోజులు ఓ సినిమాకు మరి కొన్ని రోజులు ఇంకో సినిమాకు కేటాయిస్తూ, రెండు సినిమాలు స్లయిమెంటేనియస్ గా ఫినిష్ చేసే ప్రయత్నంలో వున్నాడు. ఇప్పుడు అదే సమస్య అవుతోంది.

ఒక సినిమాకు పది రోజులు కేటాయించడం, మళ్లీ రెస్ట్, ఆపై మరో సినిమా. ఇలా చేస్తూ వుంటే ఏదీ చకచక నడవడం లేదని తెలుస్తోంది. సవ్యసాచి సినిమాను మే 25కు ఫినిష్ చేయాలనుకున్నారు. కానీ అలా రెడీ కాలేదు. జూన్ లో విడుదల అనుకున్నారు కానీ అది కూడా ఎంతవరకు సాధ్యమో అన్నది అనుమానంగా వినిపిస్తోంది.

ఎందుకంటే ఇంకా 22రోజులు షూటింగ్ బాకీ వుందని తెలుస్తోంది. ఇప్పటి దాకా చేసిన దాంట్లో తేడా వుంటే కావాలంటే ఓ వారం రీ షూట్ కు సెట్ బ్యాక్ వుంచుకోమని డైరక్టర్ చందుకు, నిర్మాతలు చెప్పారట. అంటే ఎకాఎకీ షూట్ చేసినా, జూన్ నెలలో మాత్రం షూట్ పూర్తి కాదు. అక్కడికి ఇంకా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ వుంటుంది. అందుకే జూలై మూడోవారం లేదా ఆగస్ట్ మొదటి వారానికి డేట్ ఫిక్స్ చేసుకోవాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరోపక్క ఈ నెలాఖరు వరకు శైలజరెడ్డి అల్లుడు షూట్ వుంటుంది. ఆ తరువాత మళ్లీ గ్యాప్. ఈ సినిమాను ఆగస్టు మూడోవారంలో విడుదల చేయాలని యూనిట్ ఆలోచన. కానీ సవ్యసాచి ఆగస్టు ఫస్ట్ అంటే మరి శైలజ రెడ్డి అల్లుడు సినిమాను మరికాస్త వెనక్కు నెట్టాల్సిందే.

అదే కనుక ఒక సినిమా ముందుగా ఫినిష్ చేసే పని చేసి వుంటే, ఈపాటికి సవ్యసాచి విడుదలకు రెడీ అయిపోయేది. మొత్తం మీద చైతూ ప్లానింగ్ ఎక్కడో మిస్ ఫైర్ అయినట్లుంది.