హీరోకి నచ్చని టైటిల్

సినిమాలు డిజాస్టర్లయిపోయినా, రెమ్యూనిరేషన్ సగానికి పడిపోయినా, చాన్స్ లు తగ్గిపోయినా, హీరోలు హీరోలే. సినిమా స్టార్ట్ కావాలి కానీ, వారి మాటే చెల్లాలి. అది టాలీవుడ్ రివాజు. దాదాపు ఏడాది రెండేళ్లుగా ఫ్లాపులు తప్ప…

సినిమాలు డిజాస్టర్లయిపోయినా, రెమ్యూనిరేషన్ సగానికి పడిపోయినా, చాన్స్ లు తగ్గిపోయినా, హీరోలు హీరోలే. సినిమా స్టార్ట్ కావాలి కానీ, వారి మాటే చెల్లాలి. అది టాలీవుడ్ రివాజు. దాదాపు ఏడాది రెండేళ్లుగా ఫ్లాపులు తప్ప మినిమమ్ హిట్ కూడా చవిచూడని హీరో అల్లరి నరేష్. హీరోగా చేతిలో వున్న ఏకైక సినిమా భీమినేని శ్రీనివాసరావు డైరక్షన్ లోదే.

ఆయన కూడా సుడిగాడు తరువాత సరైన సినిమా పడక హిట్ కోసం చూస్తున్నారు. అందుకే మళ్లీ సుడిగాడు మాదిరిగా సుడి తిరగాలని తమిళ్ రీమేక్ ను పట్టుకుని, అల్లరి నరేష్, సునీల్ తో సినిమా తీసేసారు. కానీ టైటిల్ దగ్గరే వస్తోంది తకరారు. సినిమా ఫినిష్ కావడానికి ముందుగానే సిల్లీ ఫెలోస్ అనే టైటిల్ ఆయన ఎస్ సెంటి మెంట్ ప్రకారం ఫిక్స్ చేసుకున్నారు.

కానీ ఆ టైటిల్ తనకు నచ్చలేదు మార్చాల్సిందే అంటున్నాడట అల్లరి నరేష్. దాదాపు నెల రోజులు అయితే నరేష్ టైటిల్ తనకు నచ్చలేదని మార్చమని. అక్కడి నుంచి డైరక్టర్ భీమినేని నానాతంటాలు పడుతున్నారు సరైన టైటిల్ కోసం. వచ్చాడయ్యా సామి, ఫన్ రాజా ఫన్, ఇలా దాదాపు యాభై టైటిళ్లు ఆలోచించారట. నిర్మాతలకు నచ్చితే, డైరక్టర్ కు ఇద్దరికీ నచ్చితే హీరోకి నచ్చడంలేదట.

పైగా ఇద్దరు హీరోల మీద టైటిల్ పెడితే అల్లరి నరేష్ ఒకె అనడం లేదని తెలుస్తోంది. సిల్లీ ఫెలోస్ అన్న టైటిల్ ను నరేష్ అందుకే రిజెక్ట్ చేసాడని వినికిడి. ఫన్ రాజా ఫన్ అంటే రన్ రాజా రన్ కు ఇమిటేషన్ అనో, మరీ సి సెంటర్ సినిమా అనో అనుకుంటారని అనుమాన పడుతున్నారట. వచ్చాడయ్యా సామి అంటే అదేం సినిమానో అనుకుంటారన్న భయం. మరేం చేస్తారో చూడాలి.