శతమానం భవతి సినిమాలో కుటుంబ సంబంధాలను సున్నితంగా తెరకెక్కించిన నిర్మాత దిల్ రాజు, ఈ సారి మానవ సంబంధాలపై దృష్టి పెట్టారట. నితిన్ హీరోగా, సతీష్ వేగ్నిశ డైరక్షన్ లో నిరిస్తున్న శ్రీనివాస కళ్యాణం సినిమాలో మానవ సంబంధాలను చర్చిస్తారట.
డబ్బు..డబ్బు..ఆర్థిక సంబంధాలే తప్ప మానవ సంబంధాలు కీలకం కాదు అనుకునే వ్యక్తి ప్రకాష్ రాజ్. అలాంటి వ్యక్తి ఓ తెలుగింటి పెళ్లికి వచ్చి, ఎలాంటి అనుభవాలు చూసాడు, ఎలా మారాడు. డబ్బు కన్నా మానవ సంబంధాలు కీలకం అని ఎలా తెలుసుకుంటాడన్నది సినిమా అంట.
ఈ సినిమా తొలిసగం అంతా విలాసంగా, నార్త్ లో హుషారుగా సాగుతుందట. మలి సగం అంతా తెలుగింటి పెళ్లి పనులు, షాపింగ్ లు, పెళ్లి ఏర్పాట్లు, హడావుడి అంతా వుంటుందట. మొత్తం మీద ఒక విధంగా శతమానం భవతికి సీక్వెల్ అన్నట్లుగా శ్రీనివాస కళ్యాణం తయారవుతోందన్నమాట.