అమెజాన్ తొలి వెబ్ సిరీస్ రెడీ

అమెజాన్ ప్రయిమ్ సంస్థ ఇండియాలోనే తొలిసారిగా నిర్మించే వెబ్ సీరీస్ బ్రాడ్ కాస్ట్ కు అంతా రెడీ అయిపోయింది. అమెజాన్ తొలి ఇండియా వెబ్ సిరీస్ ను డైరక్ట్ చేసే ఘనత మన డైరక్టర్…

అమెజాన్ ప్రయిమ్ సంస్థ ఇండియాలోనే తొలిసారిగా నిర్మించే వెబ్ సీరీస్ బ్రాడ్ కాస్ట్ కు అంతా రెడీ అయిపోయింది. అమెజాన్ తొలి ఇండియా వెబ్ సిరీస్ ను డైరక్ట్ చేసే ఘనత మన డైరక్టర్ నందినీ రెడ్డికి దక్కింది.

గ్యాంగ్ స్టర్స్ పేరిట తయారైన ఈ వెబ్ సిరీస్ లో జగపతిబాబు, నవదీప్, పోసాని, తదితరులు నటించారు. సిల్లీమాంక్స్ ఎంటర్ టైన్ మెంట్స్ లో కలిసి, వైజయంతీ మూవీస్ సిస్టర్ కన్సెర్న్ ఎర్లీ మాన్ సూన్ టేల్స్ సంస్థ ఈ వెబ్ సిరీస్ ను నిర్మించింది.

ఈ వెబ్ సిరీస్ ను త్వరలో అమెజాన్ ప్రయిమ్ లో లోడ్ చేస్తారు. అమెజాన్ ప్రయిమ్ సభ్యులంతా ఈ వెబ్ సిరీస్ ను ఫ్రీగా చూసేయచ్చు. తెలుగు నటులు ఇంత మంది వెబ్ సిరీస్ లో నటించడం ఈ గ్యాంగ్ స్టర్స్ తోనే ప్రారంభం.

ఇప్పటికే సినిమా జనాల దృష్టి వెబ్ సిరీస్ మీద పడింది. చాలా నిర్మాణ సంస్థలు, దర్శకులు వెబ్ సిరీస్ మీద దృష్టి పెట్టారు. అమెజాన్, యుప్ టీవీ తదితర సంస్థలు మంచి మొత్తాలు ఆఫర్ చేస్తుండడంతో, కాస్త పేరున్న దర్శకులంతా వెబ్ సిరీస్ ఆలోచనలు చేస్తున్నారు.