హారికలో చెల్లని మారుతి మాట?

సాధారణంగా ఏ బ్యానర్ లో అయినా దర్శకుడి మాట అంటే కాస్త విలువ వుంటుంది. అందులోనూ కాస్త స్టామినా వున్న డైరక్టర్ అయితే మరింత విలువ వుంటుంది. హారిక హాసినిలో అయితే డైరక్టర్ త్రివిక్రమ్…

సాధారణంగా ఏ బ్యానర్ లో అయినా దర్శకుడి మాట అంటే కాస్త విలువ వుంటుంది. అందులోనూ కాస్త స్టామినా వున్న డైరక్టర్ అయితే మరింత విలువ వుంటుంది. హారిక హాసినిలో అయితే డైరక్టర్ త్రివిక్రమ్ నే మోనార్క్. ఆయన గీసిన గీతను నిర్మాతలు దాటరు. అదే హారిక హాసిని సిస్టర్ కన్సెర్న్ సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో మాత్రం వ్యవహారం వేరుగా వున్నట్లు తెలుస్తోంది.

సితార బ్యానర్ మీద మారుతి డైరక్షన్ లో నాగచైతన్య హీరోగా శైలజరెడ్డి అల్లుడు సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఓవర్ సీస్ హక్కులను ఐ డ్రీమ్ వాసుదేవ రెడ్డికి ఇస్తే బాగుంటుందన్నది దర్శకుడు మారుతి ఆలోచన. ఈ మేరకు నిర్మాతలతో కాస్త సమాలోచనలు కూడా జరిగినట్లు వినికిడి.

అయితే ఇప్పుడు సితార యూనిట్ శైలజ రెడ్డి అల్లుడు హక్కులు కూడా ఎల్ఎ తెలుగు మూవీస్ కే ఇవ్వబోతున్నట్లు వినికిడి. ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా అరవింత సమేత వీర రాఘవ రెడ్డి ఓవర్ సీస్ హక్కులను ఎల్ ఎ తెలుగు మూవీస్ కు ఇచ్చారు. ఇప్పుడు అదే సంస్థకు శైలజరెడ్డి, అలాగే శర్వా-సుధీర్ వర్మ సినిమా హక్కుల కూడా ఇచ్చే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకే డీల్ కుదిరినట్లు బోగట్టా.

కానీ వాసుదేవ రెడ్డికి ఇవ్వాలని మారుతి పట్టుపడుతున్నట్లు, తమకు ఎక్కడైనా ఒకే బయ్యర్ వుండాలని, ఇద్దరు ముగ్గురు బయ్యర్లు అన్నది సరైన విధానం కాదని సితార జనాలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. చూడాలి. నిర్మాత మాట నెగ్గుతుందో? డైరక్టర్ మారుతి మాట నెగ్గుతుందో?