శ్రీనివాసకళ్యాణంపై ‘దిల్’ అసంతృప్తి?

దిల్ రాజు అంటే కేవలం నిర్మాత, పంపిణీదారుడు మాత్రమే కాదు. కాస్త అభిరుచి, ప్రేక్షకుల అభిరుచి మీద పెర్ ఫెక్ట్ జడ్జిమెంట్ వున్న వ్యక్తి. అందుకే పంపిణీదారుగా ఫెయిల్యూర్స్ ఎక్కువ వున్నాయి కానీ, నిర్మాతగా…

దిల్ రాజు అంటే కేవలం నిర్మాత, పంపిణీదారుడు మాత్రమే కాదు. కాస్త అభిరుచి, ప్రేక్షకుల అభిరుచి మీద పెర్ ఫెక్ట్ జడ్జిమెంట్ వున్న వ్యక్తి. అందుకే పంపిణీదారుగా ఫెయిల్యూర్స్ ఎక్కువ వున్నాయి కానీ, నిర్మాతగా పరాజయాలు తక్కువే. తన సినిమాలు పట్టాలెక్కించడానికి ముందే స్క్రిప్ట్ మీద చాలా టైమ్ తీసుకుంటారు. అలా చేసాక కూడా సినిమా స్టార్ట్ అయిన తరువాత విజువలైజేషన్ లో తేడా రాకుండా దగ్గర వుండి చూసుకుంటారు. తేడా వస్తే, కిందా మీదా అవుతారు.

శతమానం భవతి సినిమా విషయంలో దిల్ రాజు తీసుకున్న జాగ్రత్తలు ఇన్నీ అన్నీ కావు. సినిమా నిర్మాణం జరిగినన్ని రోజులు అవుట్ డోర్ లో సెట్ మీదే వుండిపోయారు. ఆల్ మోస్ట్ దిల్ రాజే డైరక్షన్ చేసుకున్నారు అనేంత గ్యాసిప్ లు కూడా వచ్చాయి. ఇప్పుడు మళ్లీ దిల్ రాజు అదే సినిమా డైరక్టర్ సతీష్ వేగ్నిశతో శ్రీనివాసకళ్యాణం సినిమాను ప్లాన్ చేసారు. చకచకా షూటింగ్ కూడా చేస్తున్నారు. నితిన్ ఈ సినిమా హీరో.

అయితే ఇప్పుడు వస్తున్న శ్రీనివాస కళ్యాణ్ ప్రొడెక్ట్ మీద దిల్ రాజు కాస్త అసంతృప్తిగా వున్నారని ఇండస్ట్రీలో గ్యాసిప్ లు వినిపిస్తున్నాయి. స్క్రిప్ట్ పెర్ ఫెక్ట్ గానే వున్నా, మేకింగ్ లో కాస్త తేడాగా వుందని దిల్ రాజు ఫీలయ్యారని, ఇప్పుడు ఈ సమస్యను పరిష్కరించే పనిలో బిజీగా వున్నారని వినిపిస్తోంది.

నితిన్ శ్రీనివాస కళ్యాణం సినిమా మీద చాలా ఆశలతో వున్నారు. ఇప్పటికే రెండు డిజాస్టర్లు నితిన్ ఖాతాలో వున్నాయి. అందువల్ల శ్రీనివాస కళ్యాణం హిట్ కావడం అన్నది చాలా అవసరం.