కార్తికేయ 2 ఇప్పట్లో లేనట్లే

కార్తికేయ సినిమా హీరో నిఖిల్ కెరీర్ కు మంచి మలుపు. ఆ సినిమాతో డైరక్టర్ గా చందు మొండేటి టాలీవుడ్ లో అడుగుపెట్టారు. ఆ తరువాత ప్రేమమ్, ఇప్పుడు సవ్యసాచి. అయితే నిఖిల్ తో…

కార్తికేయ సినిమా హీరో నిఖిల్ కెరీర్ కు మంచి మలుపు. ఆ సినిమాతో డైరక్టర్ గా చందు మొండేటి టాలీవుడ్ లో అడుగుపెట్టారు. ఆ తరువాత ప్రేమమ్, ఇప్పుడు సవ్యసాచి. అయితే నిఖిల్ తో కలిసి కార్తికేయ 2 చేయాలన్నది చందు మొండేటి డ్రీమ్. నిఖిల్ కు కూడా ఆ సినిమా చేయాలని కోరిక. కార్తికేయ 2 కోసం చందు స్క్రిప్ట్ ను రెడీగా వుంచారు.

అయితే దేశంలోని కీలకప్రాంతాల్లో షూట్ అవసరం అయ్యే ఈ ప్రాజెక్టుకు కాస్త బడ్జెట్ కూడా ఎక్కువే. ఎంత ఎక్కువ అంటే నిఖిల్ మాగ్జిమమ్ మార్కెట్ కన్నా ఎక్కువే. అయినా ఈ ప్రాజెక్టు మీద చందుకి, నిఖిల్ కు ప్రేమే. కానీ ఈ ప్రాజెక్టు ఇప్పట్లో తెరపైకి వెళ్లేలా లేదు.

వాస్తవానికి నిఖిల్-చందు కూడా దిల్ రాజు బ్యానర్ లో ఓ ప్రాజెక్టు చేయాల్సి వుంది. అప్పడు కార్తికేయ 2 పాజిబుల్ కావచ్చు అనుకున్నారు. అయితే ప్రస్తుతం చేస్తున్న సవ్యసాచి తరువాత సినిమాను కూడా చందు మైత్రీ మూవీస్ కే చేస్తున్నాడు. ఆ మేరకు మాటలు అయ్యాయి. అగ్రిమెంట్ లు కావాలి. అయితే మైత్రీ జనాలు మాత్రం నిఖిల్ కాంబినేషన్ లో అని అనుకోవడం లేదు. నిఖిల్ తో కార్తికేయ 2 చేద్దామా అంటే వద్దు, మంచి కథ రెడీ చేస్తే, సరైన హీరోను తాము సెట్ చేస్తామని అంటున్నారట మైత్రీ జనాలు. అంటే నిఖిల్ వద్దన్నమాటేగా?

అందువల్ల చందుకు వేరే ఆప్షన్ లేదు. అంటే కార్తికేయ 2 ఇప్పట్లో తెరకెక్కదనే అనుకోవాలి. ఇదిలా వుంటే కార్తికేయ సినిమా నిర్మాత శ్రీనివాస్ బొగ్గారం, కార్తికేయ 2 అనిపించే విధంగా సుబ్రహ్మణ్యపురం అనే టైటిల్ లో సుమంత్ హీరోగా ఓ సినిమా స్టార్ట్ చేసారు. దీనికి ట్యాగ్ లైన్ గా కార్తికేయ 2 అని వుంటుందని వినిపిస్తోంది.