వీళ్లు కూడా విడిపోయారు.. మరి వాళ్లు కలుస్తారా?

కొన్ని రోజుల కిందటి సంగతి. ఊహించని విధంగా హృతిక్ రోషన్, సుసేన్ ఖాన్ విడిపోయారు. ఆ టైమ్ లో వాళ్లిద్దరూ కలిసి మీడియాకు ఓ ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. సహృద్భావ వాతావరణంలోనే…

కొన్ని రోజుల కిందటి సంగతి. ఊహించని విధంగా హృతిక్ రోషన్, సుసేన్ ఖాన్ విడిపోయారు. ఆ టైమ్ లో వాళ్లిద్దరూ కలిసి మీడియాకు ఓ ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు. సహృద్భావ వాతావరణంలోనే తామిద్దరం విడిపోతున్నట్టు తెలిపారు. కట్ చేస్తే.. ఇప్పుడు మరో జంట కూడా సేమ్ టు సేమ్ ఇలానే విడిపోయింది. మీడియాకు నోట్ కూడా రిలీజ్ చేసింది.

బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్, ఆమె భార్య మెహర్ జెసియా విడిపోయారు. ఇష్టపూర్వకంగానే తామిద్దరం విడిపోయామని ప్రకటించుకున్నారు. 1998లో ప్రేమించి పెళ్లిచేసుకున్న ఈ జంట.. 20ఏళ్ల సుదీర్ఘ వివాహ బంధం నుంచి బయటకొచ్చేశారు.

అయితే ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. హృతిక్ రోషన్ భార్య సుసేన్, అర్జున్ రాంపాల్ కొన్నేళ్లుగా రిలేషన్ షిప్ లో ఉన్నారంటూ వార్తలొచ్చాయి. బాలీవుడ్ లో ఇది ఓపెన్ సీక్రెట్ కూడా. కేవలం ఈ ఎఫైర్ కారణంగానే హృతిక్-సుజేన్ విడిపోయారంటూ అప్పట్లో పుకార్లు గుప్పుమన్నాయి.

ఇప్పుడా రూమర్లకు మరింత ఊతమిస్తూ, అర్జున్ రాంపాల్-మెహర్ విడిపోయారు. నిజానికి హృతిక్-సుసేన్ విడిపోయిన వెంటనే అర్జున్ రాంపాల్-మెహర్ విడిపోతారని అంతా ఊహించారు. కాకపోతే ఆ ఊహ కాస్త ఆలస్యంగా నిజమైంది. మరి హృతిక్ మాజీ భార్య సుసేన్, తాజాగా విడాకులు తీసుకున్న అర్జున్ రాంపాల్ ఒకటవుతారా..? కొన్ని రోజుల తర్వాత ఇదే జరుగుతుందని అంటోంది బాలీవుడ్.

మరి ఈ మొత్తం ఎపిసోడ్ లో హృతిక్ రోషన్ పరిస్థితేంటో..? అతడు డేటింగ్ లో ఉన్నట్టు ఇప్పటివరకు ఎలాంటి వార్తలు రాలేదు. కంగనాతో నడిపిన వ్యవహారం చెడిపోయింది. ఆ తర్వాత మళ్లీ ఇంకో హీరోయిన్ తెరపైకి రాలేదు. చూద్దాం.. ఏ జంట ఏ తీరానికి చేరుతుందో!