పందెంకోడి 2కు భారీ ఆఫర్

విశాల్ నటించిన పందెం కోడి సినిమాను తెలుగు, తమిళ ప్రేక్షకులు అంత సులువుగా మర్చిపోలేరు. ఆ తరువాత ఎన్ని సినిమాలు చేసినా, విశాల్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అది. అలాంటి సినిమాకు సీక్వెల్…

విశాల్ నటించిన పందెం కోడి సినిమాను తెలుగు, తమిళ ప్రేక్షకులు అంత సులువుగా మర్చిపోలేరు. ఆ తరువాత ఎన్ని సినిమాలు చేసినా, విశాల్ కెరీర్ లో గుర్తుండిపోయే సినిమా అది. అలాంటి సినిమాకు సీక్వెల్ వస్తోంది. పందెంకోడి 2. ఈ సినిమా మేకింగ్ లో వుంది. విశాల్ లేటెస్ట్ సినిమా ఇరుంబుతెరై (అభిమన్యుడు) తమిళనాట పెద్ద హిట్ అయింది. థియేటర్ రైట్స్ 9కోట్లకు విక్రయిస్తే, 20కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తోంది.

అటు పందెం కోడి క్రేజ్, ఇటు ఇరుంబుతెరై హిట్ కలిపి, పందెం కోడి 2కి క్రేజ్ పెంచేసాయి. దీంతో టీవీ చానెళ్లు పందెం కోడి2 డిజిటల్ రైట్స్, థియేటర్ రైట్స్ కోసం తెగ పోటీ పడుతున్నాయి. లేటెస్ట్ క్రేజీ ఆఫర్ ఆల్ లాంగ్వేజెస్ కలిపి 18కోట్ల దగ్గర ఆగిందట.

వాస్తవానికి ఇప్పటి వరకు విశాల్ తన సినిమాల మీద పెద్దగా సంపాదించింది లేదు. అన్నీ స్వంతంగా విడుదల చేసుకోవడం, లేదా దెబ్బలు తినడం వంటి వ్యవహారాలే. ఇరుంబుతెరై పెద్ద హిట్ అయిందనుకుంటే, దాన్ని విడుదలకు ముందే 9కోట్లకు థియేటర్ రైట్స్ మొత్తం అమ్మేసారు. తెలుగు హక్కులు కూడా రెండున్నర కోట్లకు విక్రయించేసారు. అందువల్ల పందెంకోడి 2 విశాల్ ను ఆర్థికంగా బలోపేతం చేస్తుందని అనుకోవాలి.