ఇవేం మాటలు త్రివిక్రమ్?

రిటైర్ అయిన రాజకీయ నాయకులు, వ్యభిచారులు తరువాత తరువాత కీర్తి శేషులు అయిపోతారని, అలాగే అజ్ఞాతవాసి కూడా ఒకప్పటికి మంచి సినిమా అనిపించేసుకోవచ్చని అంటున్నారు త్రివిక్రమ్. కాకిపిల్ల కాకికి ముద్దు అని ఆయనకు అజ్ఞాతవాసి…

రిటైర్ అయిన రాజకీయ నాయకులు, వ్యభిచారులు తరువాత తరువాత కీర్తి శేషులు అయిపోతారని, అలాగే అజ్ఞాతవాసి కూడా ఒకప్పటికి మంచి సినిమా అనిపించేసుకోవచ్చని అంటున్నారు త్రివిక్రమ్. కాకిపిల్ల కాకికి ముద్దు అని ఆయనకు అజ్ఞాతవాసి ఇంకా ముద్దుగానే వుంది. మామూలుగా, రాజ్యం, రాజు అంటే ఓకె అనేవారని, కార్పొరేట్ స్టయిల్ లో తీయడం వల్ల ఆడలేదని అంటున్నారు. అంటే జనాల స్థాయిని త్రివిక్రమ్ తక్కువ అంచనా వేస్తున్నట్లు వుంది.

మంచి సినిమాను జనాలు ఎప్పుడూ వదులుకోలేదు. అది పెద్ద సినిమా అయినా, చిన్న సినిమా అయినా. తానేదో మేధావితనం రంగరించిన ఆధునిక సినిమా తీసానని, అందుకే జనాలకు నచ్చలేదని త్రివిక్రమ్ ఆత్మ వంచన చేసుకుంటున్నారేమో? ఓ పక్క తప్పులు జరగలేదని అనడం తప్పే అవుతుందని అంటూనే అజ్ఞాతవాసిని ఈ విధంగా త్రివిక్రమ్ డిఫెండ్ చేసుకోవడం అంటే ఏమనుకోవాలి?

పైగా అ..ఆ సినిమా టైమ్ లో యద్దనపూడికి క్రెడిట్ ఇవ్వకుండా, ఆ తరువాత వచ్చిన విమర్శలకు లొంగి క్రెడిట్ ఇచ్చి, విజయనిర్మలకు పేటెంట్ హక్కుల కింద డబ్బులు చెల్లించిన త్రివిక్రమ్ ఇప్పుడు యద్దనపూడిని అహో అంటూ పొగడడం, ఆమె నవలనే సినిమాగా తీసానని ఒప్పకోవడం విశేషం.

ఒక విధంగా త్రివిక్రమ్ తన మీద వస్తున్న గ్యాసిప్ లకు, విమర్శలకు సమాధానం ఇవ్వాలని డిసైడ్ అయి పత్రికలకు ఇంటర్వూ ఇచ్చినట్లు కనిపిస్తోంది. తనకు హీరోయిన్లతో లింక్ లు పెడుతున్నారని ఎదురు దాడి చేయడం, తనకు పవన్ కు మధ్య ఎడం పెరగలేదని, స్నేహం కొనసాగుతోందని చెప్పుకునే ప్రయత్నం చేయడం, అలాగే అజ్ఞాతవాసి ముఫై కోట్ల నష్టాలు పూడ్చేసామని ప్రకటించడం, ఇలా చాలా విషయాల మీద వివరణ కోసం త్రివిక్రమ్ ఇంటర్వూలు ఇస్తున్నట్లుంది.

మొత్తం మీద త్రివిక్రమ్ కాస్త దిగివచ్చినట్లే అనుకోవాలి. ఇన్నాళ్లు ఎవరు ఏమనుకుంటేనేం అన్నట్లు వుండే త్రివిక్రమ్ తనపై వచ్చే వార్తలకు, గ్యాసిప్ లకు వివరణ ఇచ్చే స్టేజ్ కు వచ్చారు.