జూలైకి ‘సాక్ష్యం’?

సినిమా అంతా రెడీ అయిపోయినా, సిజి వర్క్ కాస్త ఎక్కువే వుండడంతో సాక్ష్యం సినిమా ఓ నెల వెనక్కు వెళ్లక తప్పడం లేదు. వాస్తవానికి జూన్ రెండో వారంలో రావడానికి చాన్నాళ్ల కిందటే ఫిక్స్…

సినిమా అంతా రెడీ అయిపోయినా, సిజి వర్క్ కాస్త ఎక్కువే వుండడంతో సాక్ష్యం సినిమా ఓ నెల వెనక్కు వెళ్లక తప్పడం లేదు. వాస్తవానికి జూన్ రెండో వారంలో రావడానికి చాన్నాళ్ల కిందటే ఫిక్స్ అయ్యారు.

అయితే భారీ సినిమా కావడం, హైదరాబాద్, పోలాచ్చి, వారణాసి, దుబాయ్, హైదరాబాద్ ఇలా అయిదుచోట్ల భారీ షెడ్యూళ్లు ప్లాన్ చేయడంతో కాస్త ఆలస్యం అయింది. దీనికి తోడు అయిదు భారీ ఫైట్లు, వాటికి సిజి వర్క్ వుండడంతో, మరింత ఆలస్యం తప్పలేదు.

ఇప్పుడు సినిమా పూర్తయింది. ఎడిటింగ్ టేబుల్ మీదకు కాపీ వచ్చింది. కానీ సిజి ఫుటేజ్ మాత్రం రాలేదు. మరో రెండు వారాలకు పైగా పట్టే అవకాశం వుందని తెలుస్తోంది. అందువల్ల జూలై మొదటివారానికి విడుదల డేట్ మార్చాలని నిర్మాతలు డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

ఈ విషయం తెలియడం వల్లే, నా నువ్వే, జంబలకడి పంబ, సమ్మోహనం లాంటి సినిమాలు అన్నీ జూన్ 14న డేట్ గా ప్రకటించేసాయి. జూలై మొదటి వారంలో సాక్ష్యం సినిమా దాదాపు సోలోగానే వచ్చే అవకాశం వుంది. మూడోవారంలో నాగచైతన్య సవ్యసాచి సినిమా వుంటుంది.