అభిమన్యుడు సెలబ్రిటీ షో

ఇటీవల విశాల్ కు మంచి పేరు, లాభాలు తెచ్చిపెట్టిన సినిమా ఇరుంబుతరయై. విశాల్, సమంత, సీనియర్ నటుడు అర్జున్ కాంబినేషన్ లో కాంటెంపరరీ సమస్యపై అందించిన ఈ థ్రిల్లర్ తమిళ నాట పెద్ద హిట్…

ఇటీవల విశాల్ కు మంచి పేరు, లాభాలు తెచ్చిపెట్టిన సినిమా ఇరుంబుతరయై. విశాల్, సమంత, సీనియర్ నటుడు అర్జున్ కాంబినేషన్ లో కాంటెంపరరీ సమస్యపై అందించిన ఈ థ్రిల్లర్ తమిళ నాట పెద్ద హిట్ కావడమే కాకుండా, మంచి ప్రశంసలు దక్కించుకుంది.

ఈ సినిమా తెలుగు వెర్షన్ నే అభిమన్యుడు. తెలుగులో జూన్ 1న విడుదల అవుతోంది. అయితే ఈ సినిమాను అన్నిసినిమాల మాదిరిగా వదిలేయాలని హీరో విశాల్ అనుకోవడం లేదు. కాస్త హడావుడి, ప్రచారం చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ మధ్య కాలంలో విశాల్ సినిమాలు తెలుగులో సరిగ్గా ప్రమోట్ కావడం లేదు. వచ్చాయా, వెళ్లాయా అన్నట్లువుంది. ఎవరికీ సరిగ్గా తెలియడం లేదు కూడా.

అందుకే ఈ సారి ప్రచారం మీద దృష్టి పెట్టామని విశాల్ అంటున్నారు. అభిమన్యుడు సినిమాను సెలబ్రిటీలకు చూపించేందుకు ఓ ప్రత్యేకమైన షోను ప్లాన్ చేస్తున్నట్లు విశాల్ తెలిపారు. ఒక రోజు ముందుగా హైదరాబాద్ లో సెలబ్రిటీ షో ప్లాన్ చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు.

ఇరుంబుతెరయై సినిమా ఫస్ట్ హాఫ్ మొత్తాన్ని తమిళనాట మీడియాకు చాలా రోజులు ముందుగా చూపించామని, ఓ పెద్ద సినిమాను ఇలా చూపించడం ఇదే తొలిసారి అని విశాల్ వివరించారు. అది మంచి ఫలితం ఇచ్చిందని అన్నారు.

ఇకపై తన సినిమా పబ్లిసిటీ మీదా, సరైన మార్కెట్ మీద దృష్టి పెట్టబోతున్నట్లు విశాల్ చెప్పారు. ఇరుంబుతరై సినిమాలో వర్తమాన సమాజం తనకు తెలియకుండా ఎదుర్కుంటున్న ఓ సమస్యను చర్చించామని, ఇది అన్ని వర్గాలను ఆకట్టుకుంటుందని విశాల్ అన్నారు.