కాస్త మంచి సినిమా ఎక్కడ వుంటే దిల్ రాజు ఓ లుక్కేసేయడం కామన్. ఇంద్రగంటి మోహన్ కృష్ణ, సుధీర్ బాబు కాంబినేషన్ లో తయారవుతున్న సమ్మోహనం సినిమాను ఇప్పుడు అలాగే దగ్గరకు తీసుకున్నాడట. ఆరంభంలో తాను కొననని, కేవలం డిస్ట్రిబ్యూట్ చేస్తానని, అది కూడా నైజాం వరకే అని దిల్ రాజు చెప్పాడు.
కానీ మళ్లీ సినిమా రష్ చూసాక, మనసు మార్చుకుని, నైజాం, వైజాగ్ రెండు ఏరియాలు తన కంట్రోల్ లోకి తీసేసుకున్నాడట. ఎంత ఇస్తాను.. ఎలా తీసుకుంటాను అన్నది తరువాత, ముందు ఈ సినిమా తనది అని నిర్మాతలకు క్లియర్ గా చెప్పేసాడట. ఇటీవలే ఈ సినిమాను ఓవర్ సీస్ కు నిర్వాణ సినిమాస్ జనాలు తీసుకున్నారు. ఇప్పుడు కీలకమైన వైజాగ్, నైజాం దిల్ రాజు చేతుల్లోకి వెళ్లాయి.
దీంతో జూన్ 15న విడుదల పెట్టుకున్న సమ్మోహనం సినిమాకు ఆ విధంగా ఓ పెద్ద బర్డెన్ తప్పింది. ఆంధ్ర 8కోట్ల రేషియోలో చెబుతున్న ఈ సినిమాకు సీడెడ్, ఆంధ్రలోని మరి కొన్ని ఏరియాలు మాత్రం బిజినెస్ కావాల్సి వుంది.