15 కోట్లు హోటల్ బిల్లులే

బాహుబలి ప్రభాస్ తరువాతి సినిమా సాహో సంగతులు వింటుంటే.. బాప్ రే అనిపిస్తోంది. అసలు దుబాయ్ లో పదుల కోట్లు ఖర్చు చేసి, వందల మంది సిబ్బంది, అక్కడ ఓ చిన్న సైజు కర్మాగారం…

బాహుబలి ప్రభాస్ తరువాతి సినిమా సాహో సంగతులు వింటుంటే.. బాప్ రే అనిపిస్తోంది. అసలు దుబాయ్ లో పదుల కోట్లు ఖర్చు చేసి, వందల మంది సిబ్బంది, అక్కడ ఓ చిన్న సైజు కర్మాగారం పెట్టి మరీ భారీ ఫైట్ తీసారని అంటేనే అమ్మో అనిపిస్తోంది. అసలు ఏం చేస్తున్నారు? వందల కోట్లు ఖర్చేమిటి? ఆ కథేమిటి? అని అనిపిస్తోంది.

దుబాయ్ ఎపిసోడ్ లో కేవలం హోటల్ బిల్లులు, విమానాల ఖర్చులే 15కోట్లు ఖర్చుచేసారని తెలుస్తోంది. అంతమంది సిబ్బందిని అక్కడ అకామిడేట్ చేయాల్సి రావడంతో ఆ మేరకు ఖర్చు కాక తప్పలేదట. దర్శకుడు సుజిత్ ఏమిటి? ఇంత భారీ సినిమా ఏమిటి? అనుకుంటే, అసలు ఆ కుర్రాడు పగలు రాత్రి అనకుండా డెడికేట్ అయిపోయి పని చేస్తున్నాడట.

ఈ సినిమాను బాలీవుడ్ లో ప్రమోట్ చేయడానికి, మార్కెట్ చేయడానికి వీలుగా ముంబాయిలో యువి క్రియేషన్స్ సంస్థ ఇటీవలే తన కార్యాలయాన్ని ఏర్పాటు చేసిందట. ముంబాయిలోని సినిమా ఆఫీసుల్లో ఇది చెప్పుకోదగ్గ ఆఫీసు రేంజ్ లో అత్యంత పాష్ లుక్ తో వుందని ఇండస్ట్రీ టాక్.

ఇక సాహో గ్రాఫిక్స్ వర్క్ అయితే బాహుబలికి డబుల్ వుంటాయని వినిపిస్తోంది. ఇవన్నీ వింటుంటే, బాహుబలి తరువాత టాలీవుడ్ లో ఆ రేంజ్ సినిమా సాహోనే అనుకోవాల్సి వస్తోంది.