నాగబాబుకు బన్నీ కానుక.. 5కోట్లు

నాగబాబు నిర్మాతగా ఎలా నష్టపోయాడో? ఎంత నష్టపోయాడో సినిమాల గురించి తరచు తెలుసుకునేవారికి తెలిసిన సంగతే. అతన్ని ఆదుకోవడం కోసం మాత్రమే బన్నీ తన డేట్ లు ఆయనకు ఇచ్చి, నా పేరు సూర్య…

నాగబాబు నిర్మాతగా ఎలా నష్టపోయాడో? ఎంత నష్టపోయాడో సినిమాల గురించి తరచు తెలుసుకునేవారికి తెలిసిన సంగతే. అతన్ని ఆదుకోవడం కోసం మాత్రమే బన్నీ తన డేట్ లు ఆయనకు ఇచ్చి, నా పేరు సూర్య సినిమాకు నాగబాబుకు రాయల్టీ అందేలా చేసారు. నా పేరు సూర్య సినిమాకు నాగబాబు రూపాయి కూడా పెట్టుబడి పెట్టలేదు. కేవలం బన్నీ డేట్ లు నాగబాబు దగ్గర వున్నాయి అనో, లేదా ఆ విధంగానో ఆయనను సినిమాకు ప్రెజెంటర్ ను చేసారు.

సరే సినిమా ఫలితం ఎలా వున్నా, ఈ సినిమా ద్వారా నాగబాబుకు అయిదు కోట్ల రూపాయిలు అందినట్లు ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సినిమా అమ్మకాలు పూర్తయిన తరువాత లెక్కలు చూసి, నాగబాబుకు రాయల్టీగా నిర్మాత లగడపాటి శ్రీధర్ అయిదుకోట్లు ఇచ్చినట్లు తెలుస్తోంది. సినిమా మంచి వేయబుల్ ప్రాజెక్టు కావడంతో శ్రీధర్ కు కూడా 15 నుంచి 20కోట్ల వరకు మిగిలిందట. కానీ సినిమా విడుదల తరువాత 10కోట్ల వరకు శ్రీధర్ బయ్యర్లకు వెనక్కు ఇచ్చేసినట్లు తెలుస్తోంది.

కానీ మొత్తం మీద లగడపాటి కూడా తన పెట్టుబడికి వడ్డీలు, ఖర్చులు అన్నీ పోను కాస్తో, కూస్తో మిగుల్చుకోగలిగారు. కానీ ఎటొచ్చీ మరో సహనిర్మాతగా వ్యవహరించిన బన్నీ వాస్ మాత్రం దొరికిపోయినట్లు తెలుస్తోంది. అతని వాటాకు కూడా కొంత వచ్చింది కానీ, ఓవర్ సీస్ బయ్యర్ తో కుదుర్చుకున్న డీల్ లో, కొత్త మొత్తానికి బన్నీ వాస్ మధ్యలో హామీ వున్నారట. దాంతో లాభం కాస్తా అది తినేసిందని తెలుస్తోంది.

అయితే ఈ విషయం తెలిసి హీరో బన్నీ తరువాత ఎప్పుడయినా మరో సినిమా అతనికి చేస్తానని మాట ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏమైనా నాగబాబు అదృష్టం ఇప్పుడు బాగుంది. కొడుకు వరుణ్ తేజ్ ఫుల్ ఫామ్ లో వున్నాడు. నాగబాబుకు జబర్దస్త్ వుండనే వుంది. ఇప్పుడు ఇలా అయిదుకోట్లు రాబడి.