మహేష్ సినిమాలో పీవీపీకీ వాటా?

వంశీ పైడిపల్లి-దిల్ రాజు-అశ్వనీదత్ కాంబినేషన్ లో నిర్మించే సినిమా మీద కోర్టు కేసు వుంది కదా? 14 మందికి నోటీసులు కూడా అందాయి కదా? అని ప్రశ్నిస్తే, మిల్క్ బాయ్ లా అమాయకంగా.. ’అవునా..…

వంశీ పైడిపల్లి-దిల్ రాజు-అశ్వనీదత్ కాంబినేషన్ లో నిర్మించే సినిమా మీద కోర్టు కేసు వుంది కదా? 14 మందికి నోటీసులు కూడా అందాయి కదా? అని ప్రశ్నిస్తే, మిల్క్ బాయ్ లా అమాయకంగా.. ’అవునా.. మీకు తెలుసా’ అంటూ ఎదురు ప్రశ్నించాడు మహేష్ బాబు. కానీ ఆయనే ఓ నోటీసును స్వయంగా తీసుకున్న సంగతి, దానికి జవాబు ఇచ్చిన సంగతి కూడా దాచేసాడు. కానీ నిజం దాస్తే దాగుతుందా? ఎదురు ప్రశ్నిస్తే సరిపోతుందా?

ఇప్పుడు అదే సినిమాకు తప్పని సరిగా నిర్మాత పీవీపీకి వాటా ఇచ్చుకోవాల్సి వస్తోందని తెలుస్తోంది. బ్రహ్మోత్సవం లాంటి దారుణమైన పరమ డిజాస్టర్ ను పీవీపీ నెత్తిన రుద్దాడు మహేష్ బాబు. పైగా డబ్బులు వెనక్కు ఇచ్చేసినట్లు, మరో సినిమా చేస్తున్నట్లు గ్యాసిప్ లు పుట్టించారు. ఆ తరువాత మెల్లగా వంశీ పైడిపల్లి వైపు నుంచి అభ్యంతరాలు లేవనెత్తి, పీవీపీని తెలివిగా పక్కకు నెట్టాడు మహేష్ బాబు అని వార్తలు వినిపించాయి.

కానీ పీవీపీ ఊరుకోలేదు. తన కథను వేరే వాళ్లకు ఎలా ఇస్తారని కోర్టుకు వెళ్లారు. స్టే తెచ్చారు. పైగా బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు పీవీపీ చేస్తా అని మహేష్ చేసుకున్న అగ్రిమెంట్ వుండనే వుంది.  ఈ స్టే మీద జూన్ 4న ఫైనల్ హియరింగ్ వుంది. ఈ హియరింగ్ లో స్టే తొలిగితే ఓకే. లేదూ అంటే, దిల్ రాజు-వంశీ పైడిపల్లి-మహేష్ సినిమా అలా వుండాల్సిందే.

అందుకే ఈ తకరారు అంతా ఎందుకు? ఎలాగూ 2018 చివరిలోగా, పీవీపీకి ఓ సినిమా చేయాలన్న అగ్రిమెంట్ పాటించినట్లు అవుతుంది, బ్రహ్మోత్సవం పాపం కడిగేసుకున్నట్లు అవుతుంది, వంశీ పైడిపల్లి కథ వ్యవహారం ముగిసిపోతుంది అనే ప్లాన్ తో, ఈ ప్రాజెక్టులోకి పీవీపీని కూడా సైలెంట్ భాగస్వామిగా తీసుకోవాలని ఇప్పుడు దిల్ రాజు అండ్ కో డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.

ఈ మేరకు పీవీపీతో సిటింగ్ లు జరగాల్సి వుంది. మరి దానికి పీవీపీ కండిషన్స్ ఏమిటో? ఏమవుతుందో చూడాలి. ఇప్పటికే ఈ సినిమాకు అశ్వనీదత్ ను మహేష్ బాబు జోడించాడు. ఎప్పటిదో అగ్రిమెంట్ పూర్తయిపోతుందని, ఇప్పుడు పీవీపీని కూడా జోడిస్తే, ముగ్గురికి ఒకే సినిమాతో చెల్లు చెప్పేసినట్లు అవుతుంది.

మహేష్ తెలివే తెలివి.