Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

గే గా నటిస్తున్న హీరో

గే గా నటిస్తున్న హీరో

@నర్తనశాల. ఇదీ హీరో నాగశౌర్య లేటెస్ట్ సినిమా టైటిల్. ప్రస్తుతం ఈ సినిమా షూట్ యమా ఫాస్ట్ గా ఆర్ ఎప్ సిలో జరుగుతోంది. నర్తనశాల అనగానే జనాలకు గుర్తుకు వచ్చేది బృహన్నల పాత్ర. అంటే గే క్యారెక్టర్ అలియాస్ తేడా క్యారెక్టర్. ఇలాంటి క్యారెక్టర్లను మన తెలుగు సినిమాల్లో కామెడీ నటులే పోషిస్తారు. బాలీవుడ్ లో మాత్రం హీరోలు అలాంటి పాత్రలు చేసి మెప్పించిన వైనం వుంది.

ఇప్పుడు తెలుగులో తొలిసారి హీరో నాగశౌర్య ఈ తరహా క్యారెక్టర్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్యారెక్టర్ చాలా చిత్రంగా వుంటుందని తెలుస్తోంది. హీరో గే అని చూసే ఆడియన్స్ కు తెలుస్తూ వుంటుంది కానీ రివీల్ కాదట. హీరో అమ్మాయిలతో వుంటూ, అమ్మాయిలకు వత్తాసు పలుకుతూ, డైలాగులతో నవ్వులు పూయిస్తుంటాడట.

కొత్త దర్శకుడు శ్రీనివాస చక్రవర్తి వాస్తవానికి ఈ క్యారెక్టర్, ఈ స్క్రిప్ట్ వేరే హీరో కోసం తయారుచేసి, ఒకరిద్దరు నిర్మాతలకు వినిపించారని, కానీ గే క్యారెక్టర్ కావడంతో ధైర్యం చేయలేకపోయారని వినికిడి. సబ్జెక్ట్ విని, బాగుందని, నాగశౌర్య ధైర్యంగా చేయడానికి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. సినిమా బయటకు వస్తే తప్ప, ఈ గే వ్యవహారం అసలు సంగతి తెలియదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?