భరత్ అనే నేను తరువాత కొరటాల శివ ఎవరితో? అన్న సస్పెన్స్ కు దాదాపు తెరపడిపోయినట్లే. మళ్లీ మరో రెండు వందల కోట్ల సినిమా తప్ప, పాతిక ముఫై కోట్ల సినిమా ఆలోచన కొరటాల చేయడం లేదు. ఈసారి అంతకు మించి అన్నట్లు, మరో భారీ సినిమాకే శ్రీకారం చుడుతున్నారు. అందుకోసం మెగాస్టార్ చిరంజీవితో జట్టుకట్టడానికి డిసైడ్ అయిపోయారు.
ఈ సినిమాకోసం నవంబర్ నుంచి డేట్ లు కేటాయిస్తానని చిరంజీవి చెప్పారని వినికిడి. ఆయన ప్రస్తుతం సైరా సినిమాలో బిజీగా వున్నారు. నవంబర్ కు తన వంతు వర్క్ అయిపోతుందని ఆయన అంటున్నారని తెలుస్తోంది. నవంబర్ కాకఫోయినా జనవరికి అయినా పక్కా అని కూడా వినిపిస్తోంది.
ఈ లోగా కొరటాల బౌండ్ స్క్రిప్ట్ పని చేసుకుంటారు. అయితే ఈ సినిమాకు నిర్మాత ఎవరు అన్న విషయంలో ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. లోపాయికారీగా ఏం జరిగిందో తెలియలేదు కానీ, బయటకు మాత్రం రాలేదు. వాస్తవానికి రామ్ చరణ్-కొరటాల కాంబినేషన్లో నిరంజన్ రెడ్డి ఓ సినిమా చేయాల్సి వుంది. మరి ఆ ప్రాజెక్టునే ఇలా మారుస్తారా? లేక రామ్ చరణ్ బ్యానర్ పై చేస్తారా? ఈ రెండూ కాక, కొరటాల కమిట్ మెంట్ వున్నవారికి చేస్తారా? అన్నది తెలియాల్సి వుంది.
మొత్తానికి నానితో కొరటాల సినిమా అన్న దాంట్లో సస్పెన్స్ వీడిపోయిందనే అనుకోవాలి. ఇన్నాళ్లు నాని కొత్త సినిమా ఓకె చేయలేదు. కొరటాల డెసిషన్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఇకపై నాని కొత్త సినిమా ప్రకటన వస్తుందేమో?