Advertisement

Advertisement


Home > Movies - Movie Gossip

అమ్మమ్మగారిల్లు ట్రయిలర్ ఒకె

అమ్మమ్మగారిల్లు ట్రయిలర్ ఒకె

అమ్మమ్మగారిల్లు.. ఫీల్ గుడ్ టైటిల్. నాగశౌర్య-షామిలి హీరో హీరోయిన్లు. ఈ సినిమా ట్రయిలర్ నిన్న ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో విడుదల చేసారు. అమ్మమ్మ.. పెద్ద కుటుంబం, బంధాలు, అనుబంధాలు వంటి వాటితో కట్ చేసిన ట్రయిలర్ ఆకట్టుకునేలానే రూపొందించారు.

వాస్తవానికి గతంలో సీతరామయ్య గారి మనవరాలు, మురారి, శతమానం భవతి వంటి పల్లెటూరు బ్యాక్ డ్రాప్ ఫ్యామిలీ సినిమాలు రావడంతో, కాస్త అదే అనుభూతి కలిగింది కానీ, కలర్ ఫుల్ గా కొత్తగా అనిపించడంలో దర్శకుడు సుందర్ రాసుకున్న డైలాగులు తోడ్పడ్డాయి.

ట్రయిలర్ లో పడిన డైలాగులు అన్నీ బాగున్నాయి. వాటివల్ల ట్రయిలర్ కు కాస్త ఫీల్ గుడ్ లుక్ వచ్చింది. ఒక్క సెకెన్ నవ్వితేనే ఫొటో అందంగా వుంటుంది. నవ్వుతూ వుంటే జీవితం ఇంకెంత అందంగా వుంటుంది లాంటి చాలా మంచి డైలాగులు ట్రయిలర్ లో సెట్ చేసారు. మరి ఈ సీన్లు అన్నీ గుదిగుచ్చి ట్రయిలర్ ను పెర్ ఫెక్ట్ గా కట్ చేసినట్లే సినిమా కూడా వుంటే ఆకట్టుకునేలాగే వుంది.

రసూల్ ఎల్లోర్, కళ్యాణ్ మాలిక్ లాంటి సీనియర్ టెక్నీషియన్ల సపోర్టు బాగుంది. మరి కొత్త డైరక్టర్ సుందర్ ఎలా అవుట్ పుట్ ఇచ్చాడో సినిమా చూస్తే కానీ తెలియదు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?