భారీ యాక్షన్ మూవీ.. ఇక లేనట్టే!

సెట్స్ పైకి రాకముందు ఏదో ఊహించుకుంటారు. ఓ మాట అనుకుంటారు. తీరా లాంఛ్ చేసి సెట్స్ పైకి వెళ్లేముందు లేదా సెట్స్ పైకి వెళ్లిన తర్వాత అసలు సినిమా కనిపిస్తుంది. అప్పుడు కిందామీద పడతారు.…

సెట్స్ పైకి రాకముందు ఏదో ఊహించుకుంటారు. ఓ మాట అనుకుంటారు. తీరా లాంఛ్ చేసి సెట్స్ పైకి వెళ్లేముందు లేదా సెట్స్ పైకి వెళ్లిన తర్వాత అసలు సినిమా కనిపిస్తుంది. అప్పుడు కిందామీద పడతారు. అలా చాలా సినిమాలు ఆగిపోయిన సందర్భాలున్నాయి. ఇప్పుడు రామ్, ప్రవీణ్ సత్తారు సినిమా కూడా అలానే ఆగిపోయింది.

అవును.. వీళ్లిద్దరి కాంబోలో రావాల్సిన ఓ భారీ యాక్షన్ ఎంటర్ టైనర్ ఆగిపోయింది. సినిమాను పట్టాలపైకి తీసుకొద్దామని విశ్వప్రయత్నం చేసిన ప్రవీణ్ సత్తారు ప్రయత్నాలు ఫలించలేదు. భారీ బడ్జెట్ కారణంగా ఈ సినిమాను స్టార్ట్ చేయలేనని చేతులెత్తేశాడు నిర్మాత స్రవంతి రవికిషోర్.

ఇంతకుముందు ప్రవీణ్ సత్తారు తీసిన గరుడవేగ కూడా భారీ బడ్జెట్ సినిమానే. కాకపోతే అప్పుడు బడ్జెట్ విషయంలో జీవిత రాజశేఖర్ ఎక్కువ చొరవ తీసుకున్నారు. తమ పలుకుబడి ఉపయోగించి, ఎలాగోలా పెట్టుబడిదారుల్ని సంపాదించగలిగారు. రామ్ విషయంలో అది రిపీట్ అవ్వలేదు.

మరొకర్ని భాగస్వామిగా చేర్చుకోవడం స్రవంతి రవికిషోర్ కు ఇష్టంలేదు. నిజానికి రవికిషోర్ ఒప్పుకుంటే ఈ ప్రాజెక్టులో భాగమవ్వడానికి భవ్య క్రియేషన్స్ ఆనంద ప్రసాద్ సిద్ధమే. కానీ చర్చలు కొలిక్కిరాలేదు. సినిమా సెట్స్ పైకి రాలేదు. ప్రస్తుతానికి రామ్, ప్రవీణ్ సత్తారు విడిపోయారు. తన దగ్గరున్న కథలతో వేరే సినిమాలు స్టార్ట్ చేసే ఆలోచనలో ఉన్నారు.