డైరక్టర్లను లాక్ చేస్తున్న మైత్రీ

ఇప్పుడు టాలీవుడ్ లో టైమ్ మారింది. ఎవరి దగ్గర డైరక్టర్లు వుంటే వాళ్ల దగ్గరకే హీరోలు వెళ్తున్నారు. డైరక్టర్ దగ్గర వున్నాడు అంటే ఏ హీరో అయినా దొరుకుతాడు అని ధీమా వస్తోంది నిర్మాతలకు.…

ఇప్పుడు టాలీవుడ్ లో టైమ్ మారింది. ఎవరి దగ్గర డైరక్టర్లు వుంటే వాళ్ల దగ్గరకే హీరోలు వెళ్తున్నారు. డైరక్టర్ దగ్గర వున్నాడు అంటే ఏ హీరో అయినా దొరుకుతాడు అని ధీమా వస్తోంది నిర్మాతలకు. అందుకే డైరక్టర్లను లాక్ చేస్తున్నారు.

ఈ ఆలోచన ఎప్పుడో చేసాడు కాబట్టే డివివి దానయ్య వరుసగా మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్-రామ్ చరణ్ సినిమాలు చేయగలుగుతున్నారు.

మైత్రీ మూవీస్ ఆరంభంలో హీరోల మీద డబ్బులు జల్లేసింది. అడ్వాన్స్ ల మీద అడ్వాన్స్ లు ఇచ్చింది. కానీ ఇప్పుడు స్టయిల్ మార్చింది. డైరక్టర్లను లాక్ చేస్తోంది. సుకుమార్ తో రంగస్థలం చేస్తూనే మరో సినిమాకు లాక్ చేసింది. దాంతో మహేష్ బాబు సినిమా దొరికింది.

అర్జున్ రెడ్డి డైరక్టర్ ను ఆ వెంటనే లాక్ చేసింది. ప్రేమమ్ టైమ్ లో చందు మొండేటిని లాక్ చేసారు. అదే చందు మొండేటిని ఇప్పుడు మరో సినిమాకు కూడా లాక్ చేసారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ లాక్ చేయడం అన్నది గతంలో కొరటాల శివతో కూడా జరిగింది. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ అలా చేసినవే.

మైత్రీకి ఇంకా బోయపాటి ఓ సినిమా చేయాల్సివుంది. సంతోష్ శ్రీనివాస్, శ్రీను వైట్ల సినిమాలు వున్నాయి. భరత్ కమ్మ అనే కొత్త డైరక్టర్ సినిమా వుంది. ఇలా దాదాపు ఎనిమిది సినిమాలు ప్లానింగ్ లో వున్నాయి. ఇప్పుడు టాలీవుడ్ లో టాప్ బ్యానర్ అంటే మైత్రీనే చెప్పుకోవాలేమో? అవును.. అన్నీ బాగానే వున్నాయి. కానీ బన్నీ మాత్రం ఈ బ్యానర్ అంటే ఎందుకు దూరంగా వుంటున్నట్లు?