‘యాత్ర’కు నో అంటున్న తెలుగు నటులు

తెలుగునాట పొలిటికల్ సినిమాలు తీయడం చాలా కష్టం. అందునా ఓ సామాజిక వర్గం డామినేషన్ వున్న టాలీవుడ్ లో తీయడం మరీ కష్టం. అలాంటిది వైఎస్ బయోపిక్ అంటే ఇంకెంత కష్టం? డైరక్టర్ మహీ…

తెలుగునాట పొలిటికల్ సినిమాలు తీయడం చాలా కష్టం. అందునా ఓ సామాజిక వర్గం డామినేషన్ వున్న టాలీవుడ్ లో తీయడం మరీ కష్టం. అలాంటిది వైఎస్ బయోపిక్ అంటే ఇంకెంత కష్టం? డైరక్టర్ మహీ తలపెట్టిన వైఎస్ బయోపిక్ యాత్ర పరిస్థితి ఇదే. కీలకమైన వైఎస్ పాత్రకు మళయాల సూపర్ స్టార్ మమ్ముట్టి ఫిక్సయ్యారు. జగన్ పాత్రకు సూర్యతో సంప్రదింపులు జరుగుతున్నాయి. విజయమ్మ పాత్రకు శరణ్య, కెవిపి పాత్ర కోసం రావు రమేష్ ఫిక్సయ్యారు.

ఇక మిగిలిన పాత్రల సంగతేమిటి? అక్కడే వస్తోంది సమస్య. భారతి, షర్మిల పాత్రలు లేవు. కానీ కాంటెంపరరీ రాజకీయనాయకుల చిన్న చిన్న పాత్రలు తప్పవు. కాంగ్రెస్ కీలక నాయకులు, అన్నింటికి మించి వైఎస్ తండ్రి రాజారెడ్డి పాత్రలు వున్నాయి. చాలా వరకు పాత్రలు చిన్న చిన్నవి. కానీ మహానటిలో మాదిరిగా కాస్త నోటెడ్ జనాలు నటిస్తే, సినిమాకు వచ్చే బజ్ వేరు.

అయితే టాలీవుడ్ జనాలు అందరూ అస్సలు ఆ దిశగా ఆలోచన చేయడం లేదు. ఒకరిద్దిరిని అడిగినా, మరు క్షణం, సారీ చెబుతున్నారని తెలుస్తోంది. రాజారెడ్డి పాత్ర కోసం ఓ తెలుగు టాప్ సీనియర్ మోస్ట్ హీరోను అడిగారని, ఆయన సారీ చెప్పారని తెలుస్తోంది.

దీంతో ప్రతి చిన్న పాత్రకు తమిళ, మళయాల నటులు అంటే సమస్యగా వుంటుంది. ఎందుకంటే ఆయా భాషల్లో వారిని, తెలుగువారికి తెలిసిన వారిని తేవాలి. అలాంటి వారు చిన్న చిన్న పాత్రలు అంటే రారు. ఇదే కనుక ఎన్టీఆర్ బయోపిక్ లో చిన్న చిన్న పాత్రలయినా నటించమంటే మన సినిమా జనాలు క్యూ కడతారని, వైఎస్ బయోపిక్ అంటే మాత్రం దూరం అంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇన్ని సమస్యల మధ్య జూన్ 18 నుంచి యాత్ర బయోపిక్ షూట్ ప్రారంభం అవుతోంది.