ఆ హీరో మీద ఇప్పటికి 37కోట్లు

బెల్లంకొండ శ్రీనివాస్. ఓ పద్దతిగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. మొదటి సినిమా పెద్దగా కాస్ట్ ఫెయిల్యూర్ కాలేదు. రెండో సినిమా రాంగ్ అటెంప్ట్ అయింది. మూడో సినిమా మంచి బిజినెస్ చేసింది. ఇప్పుడు నాలుగో…

బెల్లంకొండ శ్రీనివాస్. ఓ పద్దతిగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. మొదటి సినిమా పెద్దగా కాస్ట్ ఫెయిల్యూర్ కాలేదు. రెండో సినిమా రాంగ్ అటెంప్ట్ అయింది. మూడో సినిమా మంచి బిజినెస్ చేసింది. ఇప్పుడు నాలుగో సినిమా 'సాక్ష్యం' ముస్తాబవుతోంది. ఈ సినిమాకు నిర్మాత అభిషేక్ నామా కాస్త భారీగానే ఖర్చు చేసేసినట్లు తెలుస్తోంది. 

ఇప్పటి వరకు దాదాపు ముఫై ఏడుకోట్లు ఖర్చుచేసారని వినికిడి. ఇంకా కనీసం మరో మూడుకోట్లు పెట్టుబడి వుంది. అంటే నలభైకోట్లు. శాటిలైట్, డిజిటల్ డబ్బులు బాగానే వచ్చాయి. అన్నీకలిపి 13 నుంచి 15 వరకు వచ్చినట్లు వినికిడి. కానీ మిగిలిన పాతికకోట్లు థియేటర్ల మీదే రావాలి.

మూడో సినిమా అంటే బోయపాటి పేరు ట్యాగ్ లైన్ గా వుంది. ఈ నాలుగో సినిమాకు శ్రీవాస్ డైరక్టర్. మరి ఆ కాంబినేషన్ ముఫై కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేయాలి. నైజాం నుంచి ఏడుకోట్లు ఆశిస్తున్నారు. సునీల్ దగ్గర పెడదాం అని నిర్మాత అభిషేక్ అనుకుంటే, దాన్ని బెల్లంకొండ సురేష్ మాత్రం దిల్ రాజు దగ్గరకు మార్పించినట్లు తెలుస్తోంది.

పోనీ అలాగే అనుకున్నా, రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి ఇరవై కోట్లకు మించుతుందా? మరి ఏ ధైర్యంతో అభిషేక్ నామా సాక్ష్యం సినిమా కోసం నలభైకోట్లు ఖర్చు చేసేస్తున్నారో?