ఒకపక్క బయోపిక్ కోసం క్రిష్ తో డిస్కషన్లు జరుగుతూనే వున్నాయి. మరోపక్క బాలయ్యతో సినిమా చేయాలని నిర్మాత సి కళ్యాణ్ కిందామీదా అయిపోతున్నారు. ఇంకోపక్క బోయపాటి-బాలయ్య సినిమాకు ముహుర్తం ఫిక్స్ అని వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి బోయపాటి ఫుల్ బిజీగా షూట్ లో వున్నారు. ఇలాంటి టైమ్ లో ముహుర్తం అర్జెంట్ గా చేయాల్సినంత అవసరం ఏముంది? అన్నది అనుమానం.
బాలయ్యకు ఎన్నికల ముందు ఓ సినిమా చేయాలన్నది బోయపాటితో ఒప్పందం. తన తరువాత సినిమా బాలయ్యతోనే అని బోయపాటే సభాముఖంగా ప్రకటించారు. అందువల్ల ఇక సమస్య ఏమీలేదు. ఎప్పుడో ఎన్నికల ముందు సినిమాకు ఇప్పుడు ముహుర్తం చేయాల్సిన అవసరమూ లేదు. కానీ జూన్ ఫస్ట్ వీకెండ్ లోనో, దానికి కాస్త అటుగానో బాలయ్య-బోయపాటి సినిమాకు ముహుర్తం అని వినిపిస్తోంది.
మరోపక్క ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే బోయపాటి-బాలయ్య సినిమా నిర్మాణం బాలయ్య స్వంత బ్యానర్ పైనే జరుగుతుందని తెలుస్తోంది. అలా అయితే ఇంకా స్టార్ట్ కాని ఆ బ్యానర్ కు ఇది రెండో సినిమా అవుతుంది. మొత్తంమీద బాలయ్య సినిమాలకు డిమాండ్ బాగానే వున్నట్లుంది. లేదూ అంటే ఈ మూడు సినిమాల గ్యాసిప్ లేంటీ?