‘సూర్య’ కథ మహేష్ చేసి వుంటే..?

వక్కంతం వంశీ డైరక్షన్ అంటూ ఎన్టీఆర్ క్యాంప్ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచీ ఒక వార్త తెగ చక్కర్లు కొట్టింది. ఎన్టీఆర్ కోసం తయారుచేసిన కథతోనే బన్నీతో సినిమా చేస్తున్నాడన్నది ఆ వార్త.…

వక్కంతం వంశీ డైరక్షన్ అంటూ ఎన్టీఆర్ క్యాంప్ నుంచి బయటకు వచ్చిన దగ్గర నుంచీ ఒక వార్త తెగ చక్కర్లు కొట్టింది. ఎన్టీఆర్ కోసం తయారుచేసిన కథతోనే బన్నీతో సినిమా చేస్తున్నాడన్నది ఆ వార్త. అయితే ఈ కథ వేరు, ఆ కథ వేరు అని వక్కంతం మాట.

అయితే ఈ నా పేరు సూర్యకు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ సంగతి ఇప్పుడు బయటకు వచ్చింది. నా పేరు సూర్య కథ అసలు తయారుచేసింది మహేష్ బాబు కోసం అంట. కానీ మహేష్ ఆ కథలో సత్తాను ముందే పసిగట్టేసి, చేయను గాక చేయనని చెప్పేసాడట. ఆ వైనం అంతా ఇలా వుంది.

నిర్మాత అశ్వనీదత్ ఎప్పటి నుంచో మహేష్ తో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా వక్కంతం వంశీకి ఓ ఇరవై లక్షలు అడ్వాన్స్ ఇచ్చి కథ తయారు చేయించారట. ఆ కథే ఈ నాపేరు సూర్య కథ. వన్ ఫైన్ మార్నింగ్ మహేష్ దగ్గరకు తీసుకెళ్లి కథ చెప్పిస్తే, ఈ క్యారెక్టర్ తనకు సెట్ కాదని, కథ కూడా సరిగ్గా లేదని నిర్మొహమాటంగా రిజెక్ట్ చేసాడట.

దాంతో అశ్వనీదత్ తన అడ్వాన్స్ వెనక్కు ఇమ్మని కాస్త గట్టిగానే పట్టారట వక్కంతం వంశీని. ఈ వైనం అలా అలా నల్లమలుపు బుజ్జి దగ్గరకు వెళ్లింది. ఆయన వక్కంతం వంశీని, ఆ కథను పట్టుకుని, బన్నీ దగ్గరకు వెళ్లాడు. కథ సంగతి ఎలా వున్నా క్యారెక్టర్ బాగుంది. చేస్తాను కానీ, నిర్మాతలు వేరేవాళ్లు వున్నారు. బుజ్జికి ఇంకో సినిమా చేస్తాను అన్నాడట బన్నీ. అప్పుడు అశ్వీనీదత్ 20లక్షలు వెనక్కు ఇచ్చి, బన్నీతో నా పేరు సూర్య కథను అటు ఇటు చేసి సినిమాగా మార్చాడు వక్కంతం.

అలా వక్కంతం కథ బారి నుంచి మహేష్ తప్పించుకున్నాడు, బన్నీ దొరికిపోయాడు. ఆఫ్ కోర్స్ ఇక్కడ అంతకన్నా అదృష్టం నల్లమలుపు బుజ్జిది కూడా అనుకోవాలి. కథ ఎలా వున్నా క్యారెక్టర్ తనకు నప్పదు అనుకున్నాడు మహేష్. కథ ఎలా వున్నా క్యారెక్టర్ తనకు ఓకె అనుకున్నాడు బన్నీ. కథ, క్యారెక్టర్ పెర్ ఫెక్ట్ గా మిక్స్ కాక, జనం పక్కన పెట్టారు. 

అదీ నా పేరు సూర్య తెర వెనుక కథ.