పోర్న్ ఇండస్ట్రీలో ఒక నియమం ఉంది. కొన్ని దేశాల్లో అధికారికంగా అనుమతి ఉంది పోర్న్ ఇండస్ట్రీకి. ఇదే సమయంలో అక్కడ కొన్ని నియమాలు కూడా ఉన్నాయి. వాటి ప్రకారమే పోర్న్ సినిమాలను తెరకెక్కించాల్సి ఉంటుంది. వాళ్లు ఎంత పోర్న్‌స్టార్లు అయినా.. పోర్న్ సినిమాల్లో నటించడం వారి జీవితాలకు ప్రమాదకరమే అయినా, అది తీవ్రమైన ప్రభావం, ఆరోగ్యాన్ని దెబ్బతీసే ప్రమాదం అయినా.. అది మరింత ప్రమాదకరంగా మారకుండా ఉండటానికి కొన్ని నియమాలు పెట్టుకున్నారు.
అలాగే డైరెక్టుగా పోర్న్ పరిశ్రమలోకి ప్రవేశించే యువతులతో శృంగారం చేయించకపోవడం అనే నియమం కూడా పెట్టుకున్నారు. ఈ పరిశ్రమలోకి ప్రవేశించాలనుకునే అమ్మాయిల చేత ముందుగా లెస్బియన్ శృంగార కార్యకలాపాలే చేయిస్తారు. ఈ పరిశ్రమలోని యువతులు ముందుగా ఫిమేల్‌తోనే మేట్ అవుతారు. అలా కొన్ని చిత్రాల అనుభవం కలిగిన వారితోనే మేల్‌తో జత కలుపుతారు. ఇలా సున్నితంగా మొదలుపెట్టి హార్డ్‌కోర్ వైపు పంపిస్తారు.
ఇక ఈ ఇండస్ట్రీలో పనిచేసే అమ్మాయిలకు జీతభత్యాల్లో కూడా భారీ ప్రాధాన్యతే ఉంటుంది. పోర్న్ ఇండస్ట్రీలో పనిచేసే మగాళ్లతో పోలిస్తే ఆడవాళ్లకు జీతాలు చాలా ఎక్కువ. ఆడవాళ్లకు ఇచ్చే మొత్తంలో పదోవంతు జీతాలు కూడా మగాళ్లకు లేకపోవడం విశేషం. బహుశా ఆడవాళ్లకు ఎక్కువ జీతాలు ఇచ్చే రంగం ఇదేనేమో. సినిమా ఇండస్ట్రీలో మగవాళ్లకు పారితోషకాలు చాలాఎక్కువ. హీరోయిన్లతో పోలిస్తే హీరోలకు రెమ్యూనరేషన్లు చాలా ఎక్కువ.
పోర్న్ ఇండస్ట్రీ మాత్రం అందుకు విరుద్ధం. మగావాళ్లతో పోలిస్తే ఆడవాళ్లకు జీతాలు బ్రహ్మాండమైన స్థాయిలో ఉన్నాయి. ఇవన్నీ పోర్న్ చిత్ర పరిశ్రమ గురించి వికీపీడియా చెబుతున్న విశేషాలు. పోర్న్ రంగానికి ప్రభుత్వానుమతి ఉన్న దేశాల్లోని విశేషాలు ఇవి. ఇక ఇదే సమయంలో పోర్న్ పరిశ్రమకు గురించి మరో విశేషం ఏమిటంటే.. ఈ రంగంలోకి ప్రవేశించాలనుకునే వాళ్లు హెల్త్ సర్టిఫికెట్లను కూడా ఎప్పుడూ వెంటపెట్టకుని ఉండాలి.
లైంగిక వ్యాధులు.. ప్రధానంగా హెచ్‌ఐవీ, ఇతర ప్రాణాంతక వ్యాధులు వైరస్‌లు లేవని ఎప్పటికిప్పుడు ధ్రువీకరణ పత్రాలు ఇస్తూ ఉండాలి. ప్రతి పోర్న్ మూవీకీ ఇలాంటి సర్టిఫికేషన్ తప్పనిసరి. పోర్నోస్టార్లందరూ ఇలాంటి క్లియరెన్స్ సర్టిఫికెట్లను ఎప్పటికప్పుడు వెంట పెట్టుకుని ఉండాలని పోర్న్ ఇండస్ట్రీ నియమాలు చెబుతున్నాయి. ఇప్పుడు ఈ ఉపోద్ఘాతం ఎందుకంటే.. బాలీవుడ్‌లో బిజీ అయిపోయిన సన్నీలియోన్ కూడా ఆ షరతులు కొనసాగిస్తూ ఉందట.
ఇండోకెనడియన్ పోర్న్‌స్టార్‌గా పాశ్చాత్య దేశాల్లో మంచి గుర్తింపు కలిగి ఉండిన సన్నీలియోన్ కొన్నేళ్ల కిందట బాలీవుడ్ వైపు వచ్చి బిజీ అయిపోయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చేతినిండా సినిమాలతో సాగుతోంది ఈమె. భారీ రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఇండియాలోనే సెటిల్ అయిపోయింది. పోర్న్ సినిమాలతో కెరీర్ మొదలుపెట్టి ఇప్పుడు బాలీవుడ్ సినిమాలతో బిజీ అయిపోయినా సన్నీలియోన్ తన పాత నియమాలను మాత్రం వదలడం లేదట. సినిమాల్లో తనకు పెయిర్‌గా నటించే నటుడికి ఎలాంటి లైంగిక వ్యాధులు లేవనే ధ్రువీకరణ పత్రాలను అడుగుతుందట సన్నీ.
తను ఇంటిమేట్ సన్నివేశాల్లో నటించాల్సి ఉంటే, ఆ నటుడి హెల్త్ సర్టిఫికెట్ అడుగుతోందట ఈ భామ. తొలి బాలీవుడ్ సినిమా 'జిస్మ్ 2' దగ్గర నుంచినే ఈ కథ మొదలైందట. అప్పట్లో ఆ సినిమా నిర్మాతలకు సన్నీ ఒక మెయిల్ పెట్టిందట. ఆ సినిమాలో ఇద్దరు నటులతో ఇంటిమేట్ సీన్లలో నటించాల్సి ఉంది కాబట్టి.. వారిద్దరి హెల్త్ సర్టిఫికెట్లు తనకు పంపాలని, వారికి హెచ్‌ఐవీతో సహా ఇతర లైంగిక వ్యాధులు లేవనే నిర్ధారించే సర్టిఫికెట్లను జత చేయాలని సన్నీ కోరిందట.
తన హెల్త్ సర్టిఫికెట్‌ను పంపుతూ వారి సర్టిఫికెట్స్‌ను అడిగిందట సన్నీ. పోర్న్ నేపథ్యం నుంచి వచ్చిన సన్నీ బాలీవుడ్‌కు కూడా ఈ నియమాలను పరిచయం చేసినట్టుగా ఉంది!