సాయిపల్లవి కోసం తెగించారా?

సునీల్ నారంగ్.. దగ్గుబాటి సురేష్ బాబు సినిమా కొన్నారు అంటే సాధారణంగా ఇండస్ట్రీలో నమ్మరు. వారు పంపిణీకి మొగ్గు చూపుతారు తప్ప కొనడానికి కాదు. వారి బిజినెస్ తెలివితేటలు వారివి. అయితే హను రాఘవపూడి…

సునీల్ నారంగ్.. దగ్గుబాటి సురేష్ బాబు సినిమా కొన్నారు అంటే సాధారణంగా ఇండస్ట్రీలో నమ్మరు. వారు పంపిణీకి మొగ్గు చూపుతారు తప్ప కొనడానికి కాదు. వారి బిజినెస్ తెలివితేటలు వారివి. అయితే హను రాఘవపూడి లాంటి యావరేజ్ అండ్ ప్లాప్ డైరెక్టర్ సినిమాను కేవలం తెలుగు రాష్ట్రాలకు18కోట్లకు సునీల్.. సురేష్ కలిసి కొన్నారని తెలుస్తోంది.

నిజమేనా అని అనుమానం. అయితే సాయిపల్లవి హీరోయిన్ కావడం, శర్వానంద్ సక్సెస్ లైన్ లో ఉండడం, కమెడియన్ సునీల్ కీలకపాత్రలో ఉండడంతో పడి పడి లేచె మనసు సినిమా మీద మంచి హోప్స్ ఉన్నాయి. అందుకే సురేష్.. సునీల్ కలిసి రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులు18కోట్లకు కొన్నారని వినికిడి.

ఈ సినిమాలో సాయిపల్లవి తరచు తన ప్రేమనో.. ప్రియుడినో మరచిపోయే పాత్రలో కనిపిస్తుంది అని తెలుస్తోంది. ఈ సినిమా కథకు.. సాయిధరమ్.. కరుణాకరన్ సినిమా తేజ్ ఐలవ్ యుకు కాస్త దగ్గర పోలికలు ఉన్నాయని వినికిడి.