మరికొన్ని గంటల్లో టైటిల్ పై క్లారిటీ

'ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా పేరు అసమాన్యుడు'?  'ఈ సినిమా పేరు అష్టలక్ష్మి టు అమ్ములు' 'గౌతమ్ సిద్దార్థ్ వయా అమ్ములు' 'తారక్ కొత్త సినిమా పేరు రాఘవ', Advertisement చూశారుగా.. ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి ఇలా…

'ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా పేరు అసమాన్యుడు'? 
'ఈ సినిమా పేరు అష్టలక్ష్మి టు అమ్ములు'
'గౌతమ్ సిద్దార్థ్ వయా అమ్ములు'
'తారక్ కొత్త సినిమా పేరు రాఘవ',

చూశారుగా.. ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమాకు సంబంధించి ఇలా రోజుకో టైటిల్ బయటకొచ్చింది. తన సినిమాలకు టైటిల్స్ పెట్టే విషయంలో ట్రయిల్ ఎండ్ ఎర్రర్ మెథడ్ ఉపయోగించే త్రివిక్రమ్.. ఈసారి కూడా అదే పనిచేశాడు. తన మనసులో ఉన్న టైటిల్స్ కొన్నింటిని బయటపెట్టాడు. వాటిలో ఓ పేరును ఈరోజు ప్రకటించబోతున్నాడు. 

లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం.. రాఘవ, అసమాన్యుడు అనే టైటిల్స్ నుంచి యూనిట్ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. గౌతమ్ సిద్దార్థ్ వయా అమ్ములు, అష్టలక్ష్మి టు అమ్ములు అనే టైటిల్స్ లో ఒకదాన్ని ప్రకటించే ఛాన్స్ ఉంది. వీటిలో ఒకటి బయటకొస్తుందా.. లేక ఈ రెండింటినీ పక్కనపెట్టి మరో కొత్త టైటిల్ ను ప్రకటిస్తారా అనే విషయం సరిగ్గా సాయంత్రం 4 గంటల 50 నిమిషాలకు తెలిసిపోతుంది.

తాజాగా చక్కర్లు కొడుతున్న టైటిల్స్ బట్టి చూస్తుంటే.. సినిమాలో హీరోతో పాటు హీరోయిన్ కు కూడా ప్రాధాన్యత ఉన్నట్టు కనిపిస్తోంది. ఈ విషయాన్ని గ్రేట్ ఆంధ్రా ముందే వెల్లడించింది. తారక్ సరసన హీరోయిన్ గా నటిస్తున్న పూజాహెగ్డేకు ఈ సినిమాలో చాలా మంచి రోల్ దొరికింది. సినిమాలో సగం కథ ఆమె చుట్టూనే తిరుగుతుందట. అష్టలక్ష్మి, అమ్ములు లాంటి పేర్లు తెరపైకి రావడానికి కారణం ఇదే.

ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా ఇది. హారిక-హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ చిత్రంలో సునీల్ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. తమన్ ఈ సినిమాకు సంగీత దర్శకుడు.