అసలే ప్రయోగాత్మక చిత్రం. ఆపై కూల్ రొమాంటిక్ ఎంటర్ టైనర్. మరోవైపు బాక్సాఫీస్ చూస్తే బిజీబిజీగా ఉంది. ఇలాంటి టైమ్ లో నా నువ్వే సినిమాను విడుదల చేయడం అవసరమా..? మొన్నటివరకు ఇదే యాంగిల్ లో ఆలోచించిన యూనిట్ ఇప్పుడు దాదాపు నిర్ణయం తీసేసుకుంది. నా నువ్వే సినిమాను వాయిదావేయాలని డిసైడ్ అయినట్టు తెలుస్తోంది. లేటెస్ట్ అప్ డేట్ ప్రకారం, ఈ శుక్రవారం (మే 25) నా నువ్వే సినిమా థియేటర్లలోకి రాదు.
మరో మంచి డేట్ చూసి జూన్ లో సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే థియేటర్లన్నీ మహానటి, భరత్ అనే నేను సినిమాలతో ప్యాక్ అయి ఉన్నాయి. మరోవైపు రవితేజ నటించిన నేలటిక్కెట్టు సినిమా విడుదలకు సిద్ధమైంది. కల్యాణ్ రామ్ ఫస్ట్ టైం లవర్ బాయ్ గా చేసిన ఈ సినిమాను ఇంత కాంపిటీషన్ మధ్య విడుదల చేయడం కంటే, జూన్ లో వస్తే బెటరని యూనిట్ భావిస్తోంది.
మే 25 విడుదలకి మొన్నటివరకు గట్టిపోటీ ఉండేది. మెల్లమెల్లగా అంతా సైడ్ అయిపోవడం మొదలుపెట్టారు. అందరికంటే ముందు ఆఫీసర్ తప్పుకున్నాడు. నాగ్ నటించిన ఈ సినిమాను జూన్ 1న విడుదల చేస్తామని ప్రకటించాడు వర్మ. ఇప్పుడు నా నువ్వే మూవీ కూడా దాదాపు వాయిదాపడింది.
అభిమన్యుడు, అమ్మమ్మగారిల్లు సినిమాలపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. నాగశౌర్య నటించిన అమ్మమ్మగారిల్లు సినిమాకు ఇంకా ప్రచారం ప్రారంభించలేదు. విశాల్-సమంత జంటగా తెరకెక్కిన అభిమన్యుడు సినిమాను మే 31కి వేద్దాం అనుకుంటున్నారు. సో.. వచ్చే వీకెండ్ రవితేజకు సోలో రిలీజ్ దక్కేట్టుంది. బజ్ లేని ఈ సినిమాకు సోలో రిలీజ్ అంటే అదృష్టమే.