ఇంతవరకు ఎవరికీ కమిట్ కాలేదట

ఇదిగో కొరటాల.. అదిగో సినిమా అన్నట్లు వుంది ఈ మధ్య పరిస్థితి. భరత్ అనే నేను తరువాత కొరటాల కోసం జనాలు ఎగబడుతున్నది వాస్తవం. అయితే ఆయన ఎవరికీ కమిట్ కాలేదన్నది అంతకన్నా వాస్తవం.…

ఇదిగో కొరటాల.. అదిగో సినిమా అన్నట్లు వుంది ఈ మధ్య పరిస్థితి. భరత్ అనే నేను తరువాత కొరటాల కోసం జనాలు ఎగబడుతున్నది వాస్తవం. అయితే ఆయన ఎవరికీ కమిట్ కాలేదన్నది అంతకన్నా వాస్తవం. ప్రభాస్, నాని, అఖిల్, బన్నీ, చిరంజీవి ఇలా అనేక పేర్లు వినిపిస్తున్నాయి.

అయితే తాను ఇప్పటి వరకు ఎవ్వరికీ కమిట్ కాలేదని కొరటాల అంటున్నారు. తనకు ముందు సరైన కథ, పాయింట్ తట్టాలని, ఆ తరువాతే ఎవరికి అది సూట్ అవుతుందన్న ఆలోచన అని ఆయన అంటున్నారు. చిరంజీవి గారిని ఇప్పటి దాకా భరత్ అనే నేను తరువాత కలవలేదని కొరటాల సన్నిహిత వర్గాలు తెలిపాయి.

ఇంకో నెల రోజుల తరువాత కానీ కొరటాల శివ తరువాత ప్రాజెక్టుపై క్లారిటీ రాదట. పెద్ద హీరోలతో పెద్ద సినిమా స్టార్ట్ చేయడమా? ఓ మీడియం రేంజ్ సినిమా చేసి, ఆ తరువాత పెద్ద సినిమా చేయడమా? అన్న డైలామా నడుస్తోందట.

ఈలోగా పది రోజులు టిబెట్, భూటాన్ ప్రాంతానికి వెళ్లి వచ్చిన కొరటాల శివ, ఇప్పుడు మరో నెల రోజులు హిమాలయాల ప్రాంతానికి వెళ్లే ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది.