ఆ హీరో డైరక్షన్ చేసేసాడు

చాలా మంది హీరోలు డైరక్షన్ లో వెనుక నుంచి వేలు, కాలు పెట్టడం అలవాటే. అయితే ఒక్కోసారి డైరక్టర్లుగా మారడం కూడా మామూలే. లేటెస్ట్ గా యంగ్ హీరో నాగశౌర్య కూడా డైరక్టర్ గా…

చాలా మంది హీరోలు డైరక్షన్ లో వెనుక నుంచి వేలు, కాలు పెట్టడం అలవాటే. అయితే ఒక్కోసారి డైరక్టర్లుగా మారడం కూడా మామూలే. లేటెస్ట్ గా యంగ్ హీరో నాగశౌర్య కూడా డైరక్టర్ గా మారాడు. అయితే మెయిన్ లైన్ లో కాదు. షార్ట్ లైన్ లో.

తన స్వంత బ్యానర్ ఐరా క్రియేషన్స్ పతాకంపై భూమి అనే షార్ట్ ఫిలిమ్ ను నాగశౌర్య డైరక్ట్ చేసాడు. రమణ తేజ అనే రచయిత అందించిన పాయింట్ తో ఈ షార్ట్ ఫిలిమ్ తయారుచేసాడు. అయితే ఇందులో నాగశౌర్య కనిపించడు.

నాగశౌర్యకు డైరక్షన్ మీద కాస్త ఆసక్తి వుంది. ఛలో సినిమా విషయంలో స్క్రిప్ట్ దగ్గర నుంచి ఇన్ వాల్వ్ అయ్యాడు. ఆ సినిమా స్క్రీన్ ప్లేను తనే దగ్గర వుండి చేయించుకున్నాడు. ఇప్పుడు ఆ హుషారుతోనే ఓ షార్ట్ ఫిలిమ్ డైరక్ట్ చేసేసాడు. ప్రస్తుతం నాగశౌర్య నర్తనశాల అనే సినిమాలో నటిస్తున్నాడు.