విశాల్ సినిమా జూన్ 1న?

విశాల్ లేటెస్ట్ ఇరుంబు తరయై నిన్న తమిళనాట విడుదలయింది. మాంచి అప్లాజ్ వచ్చింది. రేటింగ్ లు బాగున్నాయి. సమంతకు ఈ ఏడాది మూడో హిట్ అని టాక్ వచ్చింది. అన్నింటికి మించి, ఇందులో కీలకపాత్రలో…

విశాల్ లేటెస్ట్ ఇరుంబు తరయై నిన్న తమిళనాట విడుదలయింది. మాంచి అప్లాజ్ వచ్చింది. రేటింగ్ లు బాగున్నాయి. సమంతకు ఈ ఏడాది మూడో హిట్ అని టాక్ వచ్చింది. అన్నింటికి మించి, ఇందులో కీలకపాత్రలో నటించిన సీనియర్ అర్జున్ కు మాంచి ప్రశంసలు దక్కుతున్నాయి.

ఈ సినిమాను తెలుగులో అభిమన్యుడు పేరిట విడుదలకు రెడీ చేస్తున్నారు. 11నే విడుదల చేద్దామంటే తెలుగులో సినిమాల తాకిడి, థియేటర్ల సమస్య వల్ల కుదరలేదు. 18న విడుదల చేద్దామని అనుకుంటున్నారు. అది కూడా సోమవారం తరువాత పరిస్థితి చూసి డిసైడ్ చేస్తారు. ఎలాగూ మంచి హిట్ అయింది కాబట్టి కాస్త మంచి ప్రమోషన్ చేసి జూన్ 1న వేయాలన్న ఆలోచన కూడా వున్నట్లు వినికిడి.

అయితే ఇప్పటికే జూన్ 1కోసం రాజూగాడు, నా నువ్వే, టాక్సీవాలా, ఆఫీసర్ ఆలోచిస్తున్నాయి. ఇక ఈ లైన్ లో అభిమన్యుడు కూడా చేరుతుందేమో?