చదవేస్తే ఉన్నమతి పోయిందన్నది వెనకటి సామెత. రాను రాను ఆర్జీవీ సినిమాల పరిస్థితి ఇలాగే మారుతోంది. ఆయన అనుభవం పండుతోంది. సినిమాలు మాత్రం బాగుండడం లేదు. లేటెస్ట్ గా ఆఫీసర్ ట్రయిలర్ వచ్చింది. నాగ్-వర్మ కాంబినేషన్ లో దశాబ్దాల తరువాత వస్తున్న సినిమా. కానీ మినిమమ్ బజ్ కూడా లేదు.
ఇప్పటికి రెండు టీజర్లు వదిలారు. ఏమాత్రం ఆకట్టుకోలేదు. ఇప్పుడు ట్రయిలర్ వదిలారు. పైగా దానికి వీర హంగామా. అద్భుతం ఏదో జరగబోతోందన్నట్లు. కానీ తీరా బయటకు వచ్చిన ట్రయిలర్ ను చూస్తుంటే ఆర్జీవీ కావాలని ప్రేక్షకులను ఫూల్స్ ను చేసినట్లు అనిపిస్తోంది.
రెండు టీజర్లు కలిపేసి, మరో రెండు సీన్లు జోడించి, ఇదే ఆఫీసర్ ట్రయిలర్ అనుకోమంటున్నాడు ఆర్జీవీ. దాంతో మొత్తానికి ఒక విషయం క్లారిటీ వచ్చేసింది. ఆఫీసర్ సినిమాలో ఇంతకు మించి సరుకు వున్నట్లు లేదని. ఇక ఈ సినిమాను నాగ్ మర్చిపోవచ్చేమో?