తెలుగు సినిమాలకు సీజన్లు సంక్రాంతి, సమ్మర్, దసరా. ఈ మూడే కీలకం. సంక్రాంతిని పెద్దగా వాడుకోలేదు కానీ, ఈసారి సమ్మర్ ను ఫుల్ గా వాడేసుకున్నాయి రంగస్థలం, భరత్ అనే నేను సినిమాలు.
మిగిలినది ఏమైనా వుంటే మహానటి వాడేస్తుంది. ఇంక దీంతో సమ్మర్ సందోహం అయిపోయినట్లే అనుకోవాలి. సమ్మర్ ను నా పేరు సూర్య వాడుకోలేకపోయింది. మెహబూబా కూడా అంతే అనుకోవాలి.
ఈ నెల మొత్తం మీద ఇక మిగిలినవి రవితేజ నేలటికెట్. నాగ్ ఆఫీసర్. వీటి మీద మరీ పెద్దగా హోప్స్ లేవు. అలా అని నిరాశా లేదు. సవాలక్ష సినిమాల్లో అవో రెండు అన్నదే తప్ప వేరు కాదు.
ఇక జూన్, జూలైలకు మిగిలిన పెద్ద, భారీ సినిమాలు ఏవీ లేవు. సవ్యసాచి, శైలజారెడ్డి అల్లుడు, సాక్ష్యం ఇంకా శర్వానంద్, నాని, తేజుల సినిమాలు, ఇలా మొత్తం మీద మీడియం రేంజ్ సినిమాలే. జూన్ నుంచి మళ్లీ స్కూళ్లు, పుస్తకాలు, ఫీజులు, అదే హడావుడి.
దసరా సంగతేమిటి?
ఇదిలా వుంటే ఈ సారి దసరాకు కూడా పెద్దగా హడావుడి వున్నట్లు కనిపించడం లేదు. ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా మినహా మరొకటి దరిదాపుల్లో లేవు. బోయపాటి-చరణ్ సినిమా సంక్రాంతికే. వినాయక్ కు కథ దొరికి స్టార్ట్ అయితే బాలయ్య సినిమా వుంటుంది. లేదంటే లేదు. సైరా సినిమా సంక్రాంతికి అన్న టాక్ వుంది కానీ, సమ్మర్ కే అని కూడా వినిపిస్తోంది.
అంటే టోటల్ గా ఈ పోస్ట్ సమ్మర్ నుంచి సంక్రాంతి వరకు ఒకే ఒక భారీ సినిమా మిగిలింది.అది ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమానే. 2018 లో ఇక సినిమాలు అందించని హీరోల జాబితాలో బన్నీ, చరణ్, చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, రానా, వెంకీ, బాలయ్య, ఇలా పెద్ద హీరోలు అందరూ వున్నారు. సో..టోటల్ గా చూసుకుంటే టాలీవుడ్ సెకండాఫ్ కాస్త డల్ గానే వుండేలా వుంది.