రాసినవి కొన్ని కథలైనా అదృష్టం కొద్దీ మంచి డైరక్టర్ల చేతిలో పడ్డారు. అదే వక్కంతం వంశీని కోటి రూపాయల కథకుడిని చేసాయి. సురేందర్ రెడ్డికి వున్న కామెడీ టైమింగ్ తో వక్కంతం కథలు సూపర్ హిట్ లు అయ్యాయి. నిజానికి ఆ సినిమా, ఈ సినిమా కలిపి, కొత్త కథ వండడం అన్నది వక్కంతం స్టయిల్ అన్న విమర్శలు బలంగా వున్నాయి. కిక్ కోసం జంటిల్ మెన్ కథను చాలా వరకు వాడేసాడన్న విమర్శలు వున్నాయి.
కథలు ఎప్పుడయితే సూపర్ అన్నారో, అప్పటి నుంచి డైరక్షన్ కోసం తహతహలాడాడు. అయితే ఎంతకీ ఆ అవకాశం అందిరాలేదు. నిజానికి గొప్ప కథకులు చాలా మంది మంచి డైరక్టర్లు కాలేకపోయారు. అలాగే గొప్ప డైరక్టర్లలో కథకులు కాని వారు కూడా వున్నారు. అంటే దీన్ని బట్టి తెలిసేది ఏమిటంటే, డైరక్షన్ అన్నది అదో వ్యవహారం. కథలు అల్లడంతో డైరక్షన్ వచ్చేసినట్లు కాదు.
ఈ మధ్య చాలా మంది డైరక్టర్లు పేద్ద కెమేరామెన్ లను తెచ్చుకోవడం వెనుక రహస్యం కూడా అదే. కథకుల నుంచి ప్రమోట్ అయిన వీరు డైరక్షన్ సులువు కావడం కోసం ఈ అతి పేద్ద కెమేరామెన్ల సహాయం తీసుకుంటారన్నది బహిరంగ రహస్యం.
మళ్లీ వక్కంతం దగ్గరకు వస్తే, మొత్తానికి డైరక్షన్ లోకి రావాలనుకున్నారు వచ్చారు. కానీ ఏమయింది. ఈ మధ్యకాలంలో బన్నీకి లేనటువంటి డిజాస్టర్ తీసిచేతిలో పెట్టారు. వరుడు తరువాత మళ్లీ అంతటి డిజాస్టర్ బన్నీ కోసం తీసిన ఘనత వక్కంతంకే దక్కింది. పోనీ నా పేరు సూర్యలో వేరే వేరే లోపాలు వున్నాయి, వాటికి వక్కంతం బాధ్యుడు కాడు అనుకోవడానికి లేదు.
సినిమా మొత్తం డైరక్టర్ ఫెయిల్యూర్ అని క్లియర్ గా అర్థం అయిపోతోంది. ఏ క్రాఫ్ట్ నుంచి కూడా సరైన పనితనం రాబట్టుకోకపోవడం, సరైన ఎమోషన్లు పండించలేకపోవడం, సరైన సీన్లు రాసుకోలేకపోవడం, టోటల్ గా వక్కంతం వంశీ ఫెయిల్యూర్ తప్ప వేరు కాదు అని క్లియర్ అయిపోయింది.
ఇక ఇప్పుడు వక్కంతం వంశీ మాటలకు పడే హీరో ఎవరు? ఈ సినిమా విడుదలకు ముందు చాలా మంది మాట ఇచ్చారు. కానీ ఇప్పుడు వారిలో ఎవరు మాట మీద నిల్చుంటారు? అంటే అనుమానమే. ఎంత మంచి కథ తయారుచేసినా, కోటి ఇస్తాం ఇమ్మంటారు కానీ, డైరక్షన్ ఇస్తారా? అంటే అనుమానమే. అలా ఇచ్చారు అంటే వక్కంతం అదృష్టవంతుడే. ఇచ్చిన వాళ్లు సూపరే సూపరు.