ఆడలేక మద్దెల ఓటిదన్న వర్మ

మేధావులు అనుకునేవారు కూడా ఎస్కేపిజం నేర్చుకుంటే, ఎవరు ఏమీ చేయలేరు. రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో ఎంత యాక్టివ్ గా వుంటారో, ఆయన ఫాలోవర్లు కూడా అంతే యాక్టివ్ గా వుంటారు. సినిమా మేకింగ్…

మేధావులు అనుకునేవారు కూడా ఎస్కేపిజం నేర్చుకుంటే, ఎవరు ఏమీ చేయలేరు. రామ్ గోపాల్ వర్మ ట్విట్టర్లో ఎంత యాక్టివ్ గా వుంటారో, ఆయన ఫాలోవర్లు కూడా అంతే యాక్టివ్ గా వుంటారు. సినిమా మేకింగ్ లో ఆర్జీవీ ఎంత వెనకబడిపోయారో, హిట్ అన్నది చూసి ఆయన ఎన్నాళ్లయిందో అందరికీ తెలిసిందే.

నాగ్ తో ఆఫీసర్ సినిమా స్టార్ట్ చేసినప్పటి ఆసక్తి జనాలకు ఇప్పుడు లేకుండా పోయింది. తొలి టీజర్ వదలడంతోనే ఇది వర్మ నుంచి వస్తున్న మరో సినిమా అని జనాలు పెదవి విరిచేసారు. నాగ్ హీరోగా వున్నా, తెలుగు వెర్షన్ను కొనేవారు లేరు. దీంతో మళ్లీ రెండో టీజర్ వదిలాడు ఆర్జీవీ. అది చాలా దారుణంగా వుందని ఏకగ్రీవంగా అభిప్రాయం బయటకు వచ్చింది.

దీంతో ఇప్పుడు ఈ నెగిటివ్ ను పవన్ ఫ్యాన్స్ మీదకు తోసేస్తున్నాడు వర్మ. ఆఫీసర్ రెండో టీజర్ కు 11వేల డిస్లైక్ లు వచ్చాయట. పవన్ ఫ్యాన్స్ 11వేల మందేనా? అంటూ సర్కాస్టిక్ ట్వీట్లు చేస్తున్నాడు. అక్కడికి ఏదో తన టీజర్ అదిరిపోయింది అన్నట్లు, డిస్లైక్ చేసేవారంతా పవన్ ప్యాన్స్ అన్నట్లు. రేపు 25న సినిమా విడుదలయి, తేడావస్తే, అప్పుడూ పవన్ ఫ్యాన్స్ థియేటర్ కు రావకపోవడం వల్లనే.. అంటారేమో? కొంపదీసి.

టీజర్ కు వచ్చిన డిస్ లైక్ల వ్యవహారాన్ని సీరియస్ ఇస్యూగా సాగదీయాలని చూస్తున్నట్లుంది వర్మ. ఏకంగా ఒకటి కాదు, రెండు, మూడుకాదు, ఇంకా ఎక్కువ ట్వీట్లు చేసాడు. ఇవన్నీ చూస్తుంటే ఆఖరికి వర్మ ఈ విధంగా సినిమాను జనాల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నట్లుంది అన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.