జియో మాస్టర్ ప్లాన్: ఇకపై ఇంటర్నెట్ ఫ్రీ

ఇప్పటికే అతి తక్కువ ధరలకు ఇంటర్నెట్ సేవలు అందిస్తోంది జియో. నమ్మకశ్యం కానీ రేట్లకే ఎక్కువ స్పీడ్ తో నెట్ అందిస్తోంది. ఎమౌంట్ తక్కువే అయినప్పటికీ అది కూడా ఎందుకు చెల్లించాలి? పూర్తిగా ఉచితంగా…

ఇప్పటికే అతి తక్కువ ధరలకు ఇంటర్నెట్ సేవలు అందిస్తోంది జియో. నమ్మకశ్యం కానీ రేట్లకే ఎక్కువ స్పీడ్ తో నెట్ అందిస్తోంది. ఎమౌంట్ తక్కువే అయినప్పటికీ అది కూడా ఎందుకు చెల్లించాలి? పూర్తిగా ఉచితంగా ఇంటర్నెట్ ఎందుకు అందుబాటులోకి రాదు? సరిగ్గా జియో కూడా ఇలాంటి ఆలోచనే చేస్తోంది. కుదిరితే ఇంటర్నెట్ ను పూర్తి ఉచితంగా అందించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

జియో 4జీ హ్యాండ్ సెట్స్ ను ఎలా అయితే అందించిందో, అదే పద్ధతిలో ఈ ఉచిత ఇంటర్నెట్ ను కూడా ఇవ్వాలనుకుంటోంది జియో. కొంతమొత్తాన్ని డిపాజిట్ గా తీసుకొని 4జీ హ్యాండ్ సెట్లు అందించింది జియో. మూడేళ్ల తర్వాత ఆ డబ్బును తిరిగి వినియోగదారుడికి ఇచ్చేస్తుంది. ఇప్పుడు ఇంటర్నెట్ విషయంలో కూడా అదే రూల్. సెక్యూరిటీ డిపాజిట్ కింద 4500రూపాయలు తీసుకుంటారు. ఫ్రీగా కనెక్షన్ ఇస్తారు. కొంతకాలం తర్వాత సెక్యూరిటీ డిపాజిట్ ను తిరిగి చెల్లిస్తారన్నమాట.

ప్రస్తుతం ప్రయోగాత్మక దశలో ఉంది ఈ ప్లాన్. దీనికి 'ఫైబర్ టు ద హోమ్' అనే పేరు పెట్టింది జియో. ఇంటింటికి కేబుల్ ద్వారా అత్యధిక స్పీడ్ తో ఇంటర్నెట్ ను ఇచ్చే పథకం ఇది. ప్రారంభంలో ఏకంగా 1.1 టెరాబైట్ డేటాను కస్టమర్ కు ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించారు. 

ఇప్పటివరకు ఉన్న సమాచారం మేరకు 4500రూపాయలు డిపాజిట్ తీసుకుని జియో రూటర్ ని మనకు ఇస్తారు. దీనిద్వారా టీవీకి కూడా అనుసంధానం చేసుకోవచ్చు. అంటే ఇంటిలో నెట్ తో పాటు టీవీ కూడా వస్తుందన్న మాట. 1.1 టెరాబైట్ డేటా అనగా 1100 జీబీ వరకు ఉచితంగా అందిస్తుంది. ఇది 100జీబీ వరకు 100ఎంబీపీఎస్ స్పీడ్ లో ఇవ్వనున్నారు. ఆ తరువాత 40జీబీ 1ఎంబీపీఎస్ స్పీడ్ లో ఇవ్వనున్నారట. ఈ 40జీబీ నెలలో 25సార్లు ఇస్తారట. అంటే 40జీబీ అయిపోగానే మరో 40జీబీ యాడ్ చేస్తూ పోతారట.  అంటే వారు ఇచ్చే 1100 జీబీలో మొదటి 100జీబీ వరకు 100ఎంబీపీఎస్ స్పీడ్, మిగిలిన 1000 జీబీ 1ఎంబీపీఎస్ స్పీడ్ లో వస్తుంది. ఇలా 3నెలల పాటు ఉచితంగా ఇవ్వనున్నారు.

ప్రస్తుతం అహ్మదాబాద్, చెన్నై, ముంబయి, ఢిల్లీ నగరాల్లో ఈ పథకాన్ని త్వరలోనే ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్నారు. ఆ ఫలితాల ఆధారంగా దేశవ్యాప్తంగా 'ఫైబర్ టు ద హోమ్' ప్లాన్ ను వర్తింపజేయబోతున్నారు. ఇది గనుక సాకారం అయితే మరోసారి ధరల యుద్ధానికి తెరలేచి… నెట్ తో పాటు డీటీహెచ్ సేవలు తక్కువ ధరకు అందుబాటులోకి రానున్నాయి.