తరువాత ఏంటీ? ఇది బన్నీ అభిమానులు ఎప్పటి నుంచో అనుకుంటున్న ప్రశ్న. మిగిలిన టాప్ హీరోల లైన్ ఆఫ్ ఆర్డర్ అంతా క్లియర్ గా కళ్ల ముందు కనిపిస్తోంది. కానీ బన్నీ విషయంలో మాత్రం అలా లేదు.
అసలు బన్నీ మదిలో ఏముందో బయటకు మాట మాత్రం రాలేదు. నా పేరు సూర్య ప్రమోషన్లకు బన్నీ బయటకు వచ్చి వుంటే ఎవరో ఒకరు అడిగేవారు. చెప్పి వుండేవాడు. కానీ అదీ జరగలేదు.
నా పేరు సూర్య విడుదలయింది. ఇక ఇప్పుడు బన్నీ ఖాళీ. మరి ఎవరితో సినిమా చేస్తాడు? కొరటాల శివ ఎదురుగా వున్నాడు. కానీ ఈ కాంబినేషన్ సెట్ అవుతుందా? అన్నది అనుమానం. ఇక మిగిలింది విక్రమ్ కే కుమార్ మాత్రమే. ఈ ప్రాజెక్ట్ నే ఫైనల్ అవుతుందని మెగా వర్గాల బోగట్టా.
ఇక ఎక్కువ గ్యాప్ తీసుకోకుండానే బన్నీ సినిమాను ఒకటి రెండు రోజుల్లో ప్రకటిస్తాడని తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో బన్నీ సినిమా మీద ప్రకటన లేదా క్లారిటీ వస్తుందని తెలుస్తోంది.