అచ్చం ఎస్వీఆర్ లా మోహన్ బాబు

మహానటిలో ఆసక్తికరమైన లుక్స్ లో ఎస్వీరంగారావు ఘటోత్కచుడి లుక్ ఒకటి. ఈ పాత్రను సీనియర్ హీరో మోహన్ బాబు పోషించారు. ఈ లుక్ ఇప్పటి వరకు బయటకురాలేదు. ఆ మాటకు వస్తే ఎన్టీఆర్, ఎఎన్నార్…

మహానటిలో ఆసక్తికరమైన లుక్స్ లో ఎస్వీరంగారావు ఘటోత్కచుడి లుక్ ఒకటి. ఈ పాత్రను సీనియర్ హీరో మోహన్ బాబు పోషించారు. ఈ లుక్ ఇప్పటి వరకు బయటకురాలేదు. ఆ మాటకు వస్తే ఎన్టీఆర్, ఎఎన్నార్ లుక్ లు కూడా బయటకు రాలేదు. ఇప్పుడు మోహన్ బాబు లుక్ ను ట్విట్టర్ లోకి వదిలారు. 

మహానటిలో మాయాబజార్ సీన్ ను, అందులోని వివాహభోజనంబు పాటను మరోసారి చిత్రీకరించారు. ఈ పాటకోసం, సెట్, గెటప్ ల కోసం అప్పట్లో మాయాబజార్ కు అసిస్టెంట్ గా పనిచేసిన సింగీతం శ్రీనివాసరావుగారి సహాయం కూడా తీసుకున్నారు. ఈ పాట సినిమాకు ఓ హైలైట్ అవుతుందని భావిస్తున్నారు. 

అందులో లుక్ నే ఇప్పడు విడుదల చేసింది. మోహన్ బాబు పౌరాణిక పాత్రలకు అద్భుతంగా నప్పుతారని ఇప్పటికే ప్రూవ్ చేసుకున్నారు. అందువల్ల అనుమానం లేదు. అయితే ఎస్వీఆర్ లుక్ లోకి ఎలా మారుతాయరన్నది అందరికీ ఆసక్తికరంగా వుంది. ఇప్పుడు ఈ లుక్ చూస్తుంటే, దాదాపు మారినట్లే వుంది. ముఖ్యంగా ఫేస్ లో ఎస్వీఆర్ నుంచి వచ్చే, ఎస్వీఆర్ ను తలపించే ఆ ఎక్స్ ప్రెషన్ చాలా పక్కగా వుంది.

మహానటి సినిమా మరో మూడురోజుల్లో ప్రేక్షకుల ముందుకు వస్తుంది.