రంగస్థలం సినిమా నిర్మాణానికే రెండేళ్లు పట్టింది. దీనికి దర్శకుడు సుకుమార్ చెక్కుడు ఒకటే కారణం కాదు. చరణ్ గైర్ హాజర్లు కూడా కారణమే. అప్పుడు అప్పుడు అలా అలా లెక్క పెడితే చాలా రోజులు వస్తాయట. చరణ్ మూడ్ సరిగ్గా లేక షూటింగ్ కు ఎగ్గొట్టిన రోజలు లెక్క వేస్తే. సరే, అదంతా అయిపోయిన సంగతి.
ఇప్పుడు బోయపాటితో చేస్తున్న సినిమా విషయంలో కూడా ఇదే మళ్లీ జరుగుతోందని తెలుస్తోంది. ఇప్పటికి మూడుసార్లు చరణ్ కారణంగా షూటింగ్ క్యాన్సిల్ అయినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. పాపం, హీరోయిన్ కైరా అద్వానీని మూడు సార్లు ఇక్కడకు పిలిపించి, మళ్లీ మూడు సార్లు వెనక్కు పంపారట. షూటింగ్ లేకపోవడంతో.
ఇదిలావుంటే బోయపాటి పూర్తి యాక్షన్ సినిమాగా చరణ్ కోసం స్క్రిప్ట్ తయారు చేసిన సంగతి తెలిసిందే. ఇందులో బిహార్ సిఎమ్ క్యారెక్టర్ విలన్ గా కనిపిస్తుంది.
అయితే ఇప్పడు లేటెస్ట్ గా మరో గుసగుస వినిపిస్తోంది. చరణ్ కోరిక మేరకు, రంగస్థలం తరువాత స్క్రిప్ట్ లో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నట్లు వినికిడి. కాస్త కీలకమైన మార్పే చేసి, కొత్త జోనర్ ను బోయపాటి లైట్ గా టచ్ చేసే ఆలోచనలో వున్నట్లు తెలుస్తోంది.