నా పేరు సూర్య తరువాత ఏమిటి? ఇది బన్నీ ఫ్యాన్స్ కు ఆసక్తిగా వున్న ప్రశ్న. అయితే దీనిమీద అంత క్లారిటీలేదు. కొరటాల శివతో బన్నీ సినిమా కోసం ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి.
గీతా ఆర్ట్స్ కు అంటే చేయడేమో కొరటాల అని, కేఎల్ నారాయణను కూడా సీన్ లోకి తీసుకువచ్చినట్లు బోగట్టా. అయినా కొరటాల ఇంకా డిసైడ్ కాలేదు. ఆయన ఈ ఆదివారం బయలుదేరి విదేశాలకు వెళ్తున్నారు. కాస్త విశ్రాంతి తీసుకుని, సరైన ఆలోచనలతో తిరిగి వస్తారు.
బన్నీ మీద కొరటాల దృష్టి లేదని, ప్రభాస్ మీదే వుందని బలంగా వినిపిస్తోంది. లేదూ అంటే ఈ గ్యాప్ లో నాని లేదా అఖిల్ తో పాతిక, ముఫైకోట్ల సినిమా చేసే అవకాశం కూడా లేకపోలేదని తెలుస్తోంది.
ఇలాంటి నేపథ్యంలో విక్రమ్ కే కుమార్ తో కలిసి నల్లమలుపు బుజ్జి నిర్మాతగా బన్నీ ఓ సినిమా చేసే అవకాశం లేకపోలేదని తెలుస్తోంది. ఈ సినిమా సెట్ చేయడానికి ఇప్పుడు డిస్కషన్ల నడుస్తున్నట్లు తెలుస్తోంది.