సుధీర్ బాబు కూడా మీడియా మీదే

అన్ని పాములు తలెత్తితే, వానాపాము కూడా తలెత్తిందని సామెత. పెద్ద హీరోలు మీడియా మీద గుస్సాయిస్తున్నారు కదా? తానెందుకు అనకూడదనుకున్నాడేమో? చిన్న హీరో సుధీర్ బాబు. అందుకే ఓ వెబ్ సైట్ పై ట్విట్టర్…

అన్ని పాములు తలెత్తితే, వానాపాము కూడా తలెత్తిందని సామెత. పెద్ద హీరోలు మీడియా మీద గుస్సాయిస్తున్నారు కదా? తానెందుకు అనకూడదనుకున్నాడేమో? చిన్న హీరో సుధీర్ బాబు. అందుకే ఓ వెబ్ సైట్ పై ట్విట్టర్ లో దారుణంగా కామెంట్ చేసాడు. పైగా అది అనకూడని మాట అని కూడా తెలియలేదు మనవాడికి.

ఇంతా చేసి ఆ మీడియా అంత ఘోరంగా ఏమన్నా రాసిందా? అంటే అదీ లేదు. చిరంజీవిని లవ్ స్టోరీ చేయండి అని సుధీర్ బాబు అడగడం వరకు ఓకె, కానీ ఈ వయసులో చిరు వల్ల అయ్యేపనేనా? పైగా బాలీవుడ్ లో మాదిరి మన దగ్గర లేటు వయసు ప్రేమకథలు వుండవు కదా? అని సదరు వెబ్ సైట్ కామెంట్ చేసింది.

దానికి సుధీర్ బాబు ఇంతకన్నా గొప్పగా పాజిటివ్ నేను ఆ వెబ్ సైట్ నుంచి ఊహించలేదు అంటూ ఆ వెబ్ సైట్ పేరును విడదీసి పలుకుతూ విమర్శచేసాడు. ప్రేమకథాచిత్రం తరువాత సరైన హిట్ అన్నది సుధీర్ బాబు ఖాతాలోలేదు. మరి ఆ ఫ్రస్టేషన్ కావచ్చు. లేదా అందరూ మీడియాను అంటున్నారు కదా? తానెందుకు అనకూడదని కావచ్చు.

కానీ నిన్న దాదాపు మీడియా అంతా సమ్మోహనం టీజర్ బాగుందని మెచ్చుకున్న సంగతి గుర్తులేదు. దానికి థాంక్స్ చెబితే, బాగా లేని దానికి తిట్టడానికి అర్హత వుంటుంది. ఏమిటో ఈ హీరోలు. తమను తాము చాలా ఎక్కువ ఊహించుకుంటారేమో?